Page Loader
Sivaji on Pallavi Prashanth: రైతుబిడ్డ ప్రశాంత్ అరెస్టుపై స్పందించిన నటుడు శివాజీ
రైతుబిడ్డ ప్రశాంత్ అరెస్టుపై స్పందించిన నటుడు శివాజీ

Sivaji on Pallavi Prashanth: రైతుబిడ్డ ప్రశాంత్ అరెస్టుపై స్పందించిన నటుడు శివాజీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 22, 2023
01:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

బిగ్ బాస్ 7 సీజన్ విన్నర్ పల్లవి ప్రశాంత్(Pallavi Prashanth) అరెస్టుపై బిగ్ బాస్ కంటెస్టెంట్, నటుడు శివాజీ(Sivaji) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శివాజీ అండతోనే తాను బిగ్ బాస్ టైటిల్ గెలిచానని పల్లవి ప్రశాంత్ పేర్కొన్నాడు. బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే రోజు ఫ్యాన్స్ అల్లర్ల కారణంగా విజేతగా నిలిచిన కొన్ని గంటల్లోనే ప్రశాంత్ జైలు పాలయ్యాడు. పల్లవి ప్రశాంత్ అరెస్టుపై ఓ వీడియో ద్వారా శివాజి స్పందించాడు. చాలా మంది తనకు ఫోన్ చేసి పల్లవి ప్రశాంత్ గురించి అడుగుతున్నారని, చట్ట ప్రకారం ప్రశాంత్ బయటికొస్తాడని చెప్పారు.

Details

ప్రశాంత్ నిర్దోషిగా బయటికొస్తాడు 

ప్రశాంత్ ఎలాంటి వాడో తాను నాలుగు నెలలు ఒక హౌజ్‌లో ఉండి చూశానని, ఒక్కోసారి గెలిచాననే ఆనందం మనిషిని డామినేట్ చేస్తుందని శివాజి వెల్లడించారు. ఇలాంటి ఎగ్జైట్ మెంట్‌తో ర్యాలీలో పల్లవి ప్రశాంత్ పాల్గొన్నాడని, ఫ్యాన్స్ ఇతర కంటెస్టెంట్స్ కార్ల అద్దాలు పగలగొట్టిన విషయం ప్రశాంత్‌కు తెలియదన్నారు. వాళ్లు ఎవరి అభిమానులో కూడా తెలియదని, చేసింది ఎవరైనా జరిగింది పెద్ద తప్పు అని ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాన్నారు. ప్రశాంత్ నిర్ధోషిగానే బయటికొస్తాడని, అతను నిందితుడు కాదు, బాధితుడి అని శివాజీ చెప్పుకొచ్చారు.