తదుపరి వార్తా కథనం

Venu Thottempudi: టాలీవుడ్ హీరో వేణు తొట్టెంపూడికి పితృవియోగం
వ్రాసిన వారు
Sirish Praharaju
Jan 29, 2024
11:27 am
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ టాలీవుడ్ నటుడు వేణు తొట్టెంపూడి తండ్రి ప్రొఫెసర్ తొట్టెంపూడి వెంకట సుబ్బారావు సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన వయసు 92 ఏళ్ళు .
ఈరోజు మధ్యాహ్నం 12 గంటల వరకు హైదరాబాద్‌లోని శ్రీనగర్ కాలనీలోని ఆయన నివాసంలో ఆయన భౌతికకాయాన్ని ఉంచనున్నారు.
ఈరోజు మధ్యాహ్నం జూబ్లీహిల్స్‌లోని మహా ప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయి.
సుబ్బారావు మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.
స్వయంవరం, చిరునవ్వుతో, పెళ్లాం ఊరెళితే, హనుమాన్ జంక్షన్, ఖుషి కుషిగా, గోపి గోపిక గోదావరి వంటి చిత్రాలతో వేణు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.