LOADING...
Tollywood: యాక్షన్‌ నుంచి 'కట్‌' వరకు.. దర్శకత్వంలో అడుగుపెడుతున్న యువ హీరోలు
యాక్షన్‌ నుంచి 'కట్‌' వరకు.. దర్శకత్వంలో అడుగుపెడుతున్న యువ హీరోలు

Tollywood: యాక్షన్‌ నుంచి 'కట్‌' వరకు.. దర్శకత్వంలో అడుగుపెడుతున్న యువ హీరోలు

వ్రాసిన వారు Moogati Shabari
Jul 01, 2026
11:59 am

ఈ వార్తాకథనం ఏంటి

వెండితెరపై నటనతో ప్రేక్షకులను అలరించడం ఒక కళ అయితే, కెమెరా వెనుక నిలబడి కథను తన ఊహాశక్తి, సృజనాత్మక దృక్పథంతో ఆవిష్కరించడం మరో స్థాయి ప్రతిభ. నటులుగా గుర్తింపు తెచ్చుకున్న పలువురు యువ కథానాయకులు ఇప్పుడు దర్శకులుగా కొత్త ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్నారు. తెరపై నటుడిగా కనిపిస్తూనే, తెరవెనుక దర్శకుడిగా సినిమాను నడిపించే బాధ్యతను స్వీకరిస్తున్నారు. తాజాగా ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కూడా మెగాఫోన్ పట్టి దర్శకుడిగా తన ప్రయాణానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా నటులుగా విజయాలు సాధించి, దర్శకులుగానూ తమ ప్రతిభను నిరూపించుకున్న టాలీవుడ్ నటుల గురించి తెలుసుకుందాం.

వివరాలు

రామ్ పోతినేని..

2006లో విడుదలైన 'దేవదాసు' చిత్రంతో సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన రామ్ పోతినేని, దాదాపు రెండు దశాబ్దాల తర్వాత దర్శకుడిగా కొత్త బాధ్యతలు చేపట్టారు. తన 23వ చిత్రానికి స్వయంగా దర్శకత్వం వహించడంతో పాటు కథను కూడా ఆయనే సిద్ధం చేయడం విశేషం. ఆధునిక సాంకేతికత, కొత్త తరహా ఆలోచనల సమ్మేళనంగా రూపొందనున్న సైకాలజికల్ యాక్షన్ థ్రిల్లర్‌తో దర్శకుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

వివరాలు

విష్వక్ సేన్..

'మాస్ కా దాస్'గా పేరొందిన విష్వక్ సేన్ నటుడిగానే కాకుండా కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం వంటి విభాగాల్లోనూ తన ప్రతిభను చాటుకుంటున్నారు. 'ఫలక్‌నుమా దాస్' చిత్రంతో తొలిసారిగా దర్శకుడిగా పరిచయమైన ఆయన, అనంతరం 'దాస్ కా దమ్కీ'కి దర్శకత్వం వహించి కమర్షియల్ విజయాన్ని అందుకున్నారు. ఒకే చిత్రంలో కథ రచయిత, స్క్రీన్‌ప్లే రచయిత, దర్శకుడు, హీరోగా బాధ్యతలు నిర్వహించడం విష్వక్ ప్రత్యేకతగా నిలిచింది.

Advertisement

వివరాలు

అడివి శేష్..

విభిన్నమైన థ్రిల్లర్ చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు పొందిన అడివి శేష్, తన సినీ ప్రయాణం ప్రారంభ దశలోనే 'కర్మ', 'కిస్' చిత్రాలకు దర్శకత్వం వహించారు. అనంతరం 'క్షణం', 'గూఢచారి', 'మేజర్' వంటి విజయవంతమైన చిత్రాలకు కథ, స్క్రీన్‌ప్లే రూపకల్పనలో కీలక పాత్ర పోషిస్తూ తన సృజనాత్మక ముద్రను చాటుకున్నారు.

Advertisement

వివరాలు

రాహుల్ రవీంద్రన్..

'అందాల రాక్షసి' వంటి చిత్రాలతో నటుడిగా గుర్తింపు పొందిన రాహుల్ రవీంద్రన్, దర్శకుడిగా కూడా తన ప్రతిభను నిరూపించుకున్నారు. సుశాంత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'చి.ల.సౌ' చిత్రానికి దర్శకత్వం వహించి జాతీయ అవార్డు అందుకున్నారు. అనంతరం నాగార్జునతో 'మన్మథుడు 2'ను రూపొందించారు. తాజాగా 'ది గర్ల్‌ఫ్రెండ్‌' చిత్రంతో యువ ప్రేక్షకులను ఆకట్టుకుని ప్రశంసలు అందుకున్నారు.

Advertisement