
Karthi: శబరిమల అయ్యప్ప ఆలయాన్ని సందర్శించిన కోలీవుడ్ నటుడు కార్తి
ఈ వార్తాకథనం ఏంటి
కోలీవుడ్ ప్రముఖ నటులు కార్తి, రవి మోహన్ గురువారం శబరిమలక్షేత్రానికి చేరుకున్నారు.
నిన్న రాత్రి స్వామి వారిని దర్శించుకున్నారు. ఇటీవల స్వామిమాల ధరించిన విషయాన్ని కార్తి వెల్లడించారు.
ఆయన మాట్లాడుతూ, ''ఇరుముడి కట్టుతో శబరిమల కొండపైకి రావడం ఎంతో ఆనందంగా ఉంది. కన్నె స్వామిగా ఇక్కడికి వచ్చాను. పవళింపు సేవల సమయంలో స్వామి దర్శించుకోవడం ఒక విశేష అనుభూతిని ఇచ్చింది. భవిష్యత్తులోనూ స్వామిని దర్శించాలనే ఆకాంక్ష ఉంది,'' అని తెలిపారు.
వివరాలు
2015 సంవత్సరం నుండి శబరిమలకు..
రవి మోహన్ మాట్లాడుతూ.. తాను గతంలో ఎన్నోసార్లు శబరిమల దర్శనానికి వచ్చానని, ఈ యాత్ర తనకు ఆధ్యాత్మిక శాంతిని కలిగిస్తుందని చెప్పారు.
''2015 సంవత్సరం నుండి నేను శబరిమలకు వస్తున్నాను. ఇప్పటివరకు దాదాపు తొమ్మిదిసార్లు ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శించాను. అయ్యప్ప స్వామిపై నాకు గాఢమైన భక్తి ఉంది. ఆయన ఆశీస్సులతో నా జీవితంలో చాలా మంచి సంఘటనలు చోటు చేసుకున్నాయి'' అని వివరించారు.