Page Loader
మగబిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా..  ఇంతకీ పేరు ఏం పెట్టిందో తెలుసా?
మగబిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా

మగబిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా..  ఇంతకీ పేరు ఏం పెట్టిందో తెలుసా?

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Aug 06, 2023
09:48 am

ఈ వార్తాకథనం ఏంటి

గోవా బ్యూటీ, హీరోయిన్ ఇలియానా తల్లిగా ప్రమోషన్ పొందారు.. పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. తన పుత్రుడి ఫోటోతో పాటు పేరునూ సోషల్ మీడియాలో షేర్ చేశారు. తాను గర్భవతినని గత ఏప్రిల్ లోనే ఇలియానా ప్రకటించారు. తాజాగా ఆగస్ట్ 1న తనకు కుమారుడు పుట్టినట్లు ఇన్స్టాలో షేర్ చేశారు. ఈ క్రమంలోనేే తమకు కొడుకు పుట్టిన ఆనందాన్ని నెటిజన్లతో,అభిమానులతో పంచుకున్నారు. కుమారుడికి 'కోవా ఫీనిక్స్ డోలన్' అనే పేరును పెట్టినట్లు ఇన్‌స్టాలో వేదికగా పేర్కొన్నారు. డోలన్ పుట్టడం మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉందని పుత్రోత్సాహాన్ని వ్యక్తం చేశారు. ఈ చిట్టి డార్లింగ్‌ని ప్రపంచంలోకి ఆహ్వానిస్తున్నామన్నారు. ఇలియానా తల్లి అయ్యిందని తెలియడంతో అటు ఫ్యాన్స్, ఇటు సెలబ్రిటీలు కంగ్రాట్యులేషన్స్ అంటూ హెరెత్తిస్తున్నారు.

ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేయండి

ఇలియానా ఇన్‌స్టాలో పెట్టిన పోస్టు