తదుపరి వార్తా కథనం

Actress Pragathi : రెండో పెళ్లి వార్తపై ప్రగతి ఆగ్రహం.. మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా అని నిలదీత
వ్రాసిన వారు
TEJAVYAS BESTHA
Oct 30, 2023
12:51 pm
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ ప్రముఖ నటి ప్రగతి తీవ్రంగా మండిపడ్డారు. రెండో పెళ్లి చేసుకోబోతోందని వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో స్పందించిన సీనియర్ నటీమణి, సోషల్ మీడియాలో ఓ వీడియో రిలీజ్ చేసింది.
తప్పుడు వార్తల వల్ల ఎంతో మథనపడ్డానని, తన వ్యక్తిగత జీవితంలోకి రావడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు.
అసలు ఆధారాలు లేకుండా వార్తలు రాసే హక్కు ఎవరిచ్చారని ఫేక్ వార్తలను ప్రచురించిన సంస్థలపై తీవ్రంగా ఆగ్రహించారు.
ప్రముఖ మీడియా సంస్థ నుంచి రూమర్లు రావడం చాలా బాధగా అనిపిస్తోందన్న ప్రగతి, మీ సంస్థలో ఎవరైనా కలలు గని ఇలాంటి వార్త రాశారా అని నిలదీసింది.
ఈ వార్తను తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు.రాసే ముందు నిజ నిజాలు తెలుసుకోండని హితవు పలికింది.