ఆదిపురుష్ ట్రైలర్: మే 9వ తేదీన ముహూర్తం; దర్శకుడికి లాస్ట్ ఛాన్స్ అంటున్న నెటిజన్లు
ప్రభాస్ రాముడిగా, బాలీవుడ్ హీరోయిన్ క్రితిసనన్ సీతగా ఆదిపురుష్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు జూన్ 16వ తేదీన రాబోతున్నారు. దర్శకుడు ఓం రౌత్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్ర ట్రైలర్ మే 9వ తేదీన రిలీజ్ అవుతుంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు. అయితే 9వ తేదీ రోజున ఏ టైమ్ లో విడుదల అవుతుందనేది వెల్లడి చేయలేదు. ట్రైలర్ రిలీజ్ డేట్ ప్రకటించినప్పటికీ ప్రభాస్ అభిమానులు హుషారుగా ఉన్నారు. అదే టైమ్ లో కొంత టెన్షన్ తో ఉన్నారు. టీజర్ రిలీజైనప్పుడు వచ్చిన నెగెటివిటీ అభిమానులను ఇబ్బంది పెడుతోంది. టీజర్ లో గ్రాఫిక్స్ బాలేదని, పాత్రలను సరిగ్గా చూపించలేదని విమర్శలు వచ్చాయి. ట్రైలర్ లో అలాంటి పొరపాట్లు ఉండకూడదని అనుకుంటున్నారు.
ఓం రౌత్ కు లాస్ట్ ఛాన్స్ అంటున్న నెటిజన్లు
దర్శకుడు ఓం రౌత్ కి ఇదే లాస్ట్ ఛాన్స్ అని, సినిమా మీద ఆసక్తి కలిగించడానికి ట్రైలర్ అనేది అతిపెద్ద ఆయుధమని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. టీజర్ రిలీజ్ టైమ్ లో వచ్చిన నెగెటివిటీని పరిగణలోకి తీసుకున్న చిత్రబృందం, గ్రాఫిక్స్ పనుల కోసం అదనంగా వందకోట్ల వరకు ఖర్చు పెట్టిందని టాక్. ఈ మధ్య చిత్ర నిర్మాత భూషణ్ కుమార్ కూడా గ్రాఫిక్స్ విషయంలో రిపేర్లు జరిగాయని అన్నాడు. టీ సిరీస్, రెట్రో ఫైల్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి భూషణ్ కుమార్, క్రిషణ్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.