Page Loader
ఆదిపురుష్ వివాదల వరుస: హనుమంతుడు భగవంతుడు కాదని కామెంట్ చేసిన రచయిత 
హనుమంతుడు భగవంతుడు కాదని డైలాగ్ రైటర్ మనోజ్ కామెంట్స్

ఆదిపురుష్ వివాదల వరుస: హనుమంతుడు భగవంతుడు కాదని కామెంట్ చేసిన రచయిత 

వ్రాసిన వారు Sriram Pranateja
Jun 20, 2023
04:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆదిపురుష్ చిత్రాన్ని వివాదాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే నేపాల్ లో కొన్ని నగరాల్లో ఆదిపురుష్ చిత్రాన్ని నిషేధించారు. ఈ సినిమాలోని డైలాగులు రామాయణాన్ని వక్రీకరించే విధంగా ఉన్నాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. తాజాగా ఆదిపురుష్ డైలాగ్ రైటర్ మనోజ్ మాట్లాడుతూ, హనుమంతుడు భగవంతుడు కాదని, ఆయనొక భక్తుడనీ, ఆ భక్తిలోని శక్తి కారణంగా హనుమంతుడిని భగవంతుడిని చేసామని అన్నాడు. ఈ మాటలపై వివాదం చెలరేగింది. మనోజ్ ఇప్పటికైనా నోరు మూసుకుంటే బాగుంటుందనీ, అనవసర కామెంట్లు చేయకపోతే మంచిదనీ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. హనుమంతుడు శివుడి అవతారమనీ మరొక నెటిజన్ అన్నాడు. ఇంకొకరేమో మనోజ్ చేసేవన్నీ పనికిరాని వాదనలే అని అన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

హనుమంతుడిపై మనోజ్ మాట