యాక్షన్ సీన్లే హైలైట్ గా ఆదిపురుష్ సెకండ్ ట్రైలర్ వచ్చేసింది
ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్, తిరుపతిలో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆదిపురుష్ రిలీజ్ ట్రైలర్ ని చిత్రబృందం విడుదల చేసింది. ఈ ట్రైలర్ లో పూర్తిగా యాక్షన్ సీక్వెన్సులు ఉన్నాయి. సీతను రావణాసురుడు అపహరించడం దగ్గరి నుండి లంకకు రాముడు వెళ్ళి రావణాసురిడిపై బ్రహ్మాస్త్రం వేయడం వరకూ చూపించారు. ట్రైలర్ చూస్తుంటే, ఇదివరకెప్పుడూ చూడని దృశ్యాలను వెండితెర మీద చూడబోతున్నామని కలుగుతోంది. యాక్షన్ సీన్లు వేరే లెవెల్లో ఉన్నాయి. త్రీడీలో ఈ సీన్లు మరింత బాగా కనిపిస్తాయడంలో సందేహం లేదు. ఈ ట్రైలర్ లో మాటలు మరొక ఆకర్షణ. రాముడిగా ప్రభాస్ పలికిన డైలాగులు బాగున్నాయి. మొత్తానికి ప్రభాస్ అభిమానులకు సెకండ్ ట్రైలర్ రూపంలో మరో నమ్మకం దొరికింది.
సందేహాలను పటాపంచలు చేసిన సెకండ్ ట్రైలర్
మొదటి ట్రైలర్ రిలీజ్ అయినపుడు ఆదిపురుష్ పై నెగెటివిటీ తగ్గిపోయింది. కాకపోతే కొందరిలో ఎక్కడో చిన్న అనుమానం మిగిలిపోయింది. ఆ అనుమానాన్ని ఆదిపురుష్ సెకండ్ ట్రైలర్ పూర్తిగా పోగొట్టేస్తుంది. ఇకపై ఎలాంటి సందేహాలు లేకుండా ఆదిపురుష్ చిత్రాన్ని వెండితెర మీద చూడవచ్చని అనుకునేలా ట్రైలర్ ని కట్ చేసారు. రాముడి పాత్రలో ప్రభాస్ కనిపిస్తుంటే సీత పాత్రలో క్రితిసనన్ నటిస్తోంది. టీ సిరీస్, రెట్రో ఫైల్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజీవ్ నాయర్ నిర్మిస్తున్నారు. జూన్ 16వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల అవుతుంది.