ఆదిపురుష్ ట్రైలర్ స్క్రీనింగ్: AMB థియేటర్ లో అభిమానులను కలవనున్న ప్రభాస్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రభాస్ రాముడిగా నటిస్తున్న ఆదిపురుష్ చిత్రం జూన్ 16న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో ఆదిపురుష్ ట్రైలర్ ని రేపు రిలీజ్ చేస్తామని చిత్రబృందం ప్రకటించిన సంగతి తెలిసిందే.
అయితే ఈరోజు సాయంత్రం ఆదిపురుష్ ట్రైలర్ ను హైదరాబాద్ లో ఏ ఎమ్ బీ థియేటర్లో ప్రదర్శిస్తున్నారు. 4గంటల 20నిమిషాలకు టైలర్ ప్రదర్శన ఉంటుందని సమాచారం.
మరో విషయం ఏంటంటే, ఏ ఎమ్ బీ థియేటర్ కు ప్రభాస్ వస్తున్నాడు. సాయంత్రం 4గంటలకు థియేటర్ కు ప్రభాస్ చేరుకుంటాడని తెలుస్తోంది. ఆల్రెడీ ఎ ఎమ్ బీ దగ్గరకు ప్రభాస్ అభిమానులు చేరుకుంటున్నారు.
ఆదిపురుష్ టీజర్ కు నెగెటివ్ రివ్యూస్ వచ్చాయి. ట్రైలర్ మాత్రం అలా ఉండదనీ, అందరినీ సంతృప్తి పరుస్తుందని అభిమానులు నమ్ముతున్నారు.
Details
త్రీడీలో విడుదలవుతున్న ట్రైలర్
ఏ ఎమ్ బీ థియేటర్లో త్రీడీ వెర్షన్ లో ట్రైలర్ రిలీజ్ అవుతుందని చెబుతున్నారు. మరి ఈ ట్రైలర్ పై అభిమానులు ఎలా స్పందిస్తారో మరికొద్ది సేపట్లో తెలిసిపోతుంది.
ఇదిలా ఉంటే, ఆదిపురుష్ ట్రైలర్ ని రేపు కూడా థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. సుమారు 70దేశాల్లోని థియేటర్లలో ట్రైలర్ స్క్రీనింగ్ ఉండనుంది.
టీజర్ ద్వారా వచ్చిన నెగెటివిటీ, రిలీజ్ కాబోయే ట్రైలర్ ద్వారా దూరమైపోయి సినిమా మీద ఆసక్తిని పెంచుతుందేమో చూడాలి.
ఈ సినిమాలో క్రితిసనన్ సీత పాతలో కనిపిస్తుంది. లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్ చేసారు.
టీ సిరీస్, రెట్రో ఫైల్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాను దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించాడు.