LOADING...
Siddharth-Aditi: అదితి ఉదయాన్నే నా నుంచి దాన్ని లాగేసుకుంటుంది : సిద్ధార్థ్‌
అదితి ఉదయాన్నే నా నుంచి దాన్ని లాగేసుకుంటుంది : సిద్ధార్థ్‌

Siddharth-Aditi: అదితి ఉదయాన్నే నా నుంచి దాన్ని లాగేసుకుంటుంది : సిద్ధార్థ్‌

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 18, 2024
11:53 am

ఈ వార్తాకథనం ఏంటి

హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి రావు హైదరి ఇటీవల వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరి పెళ్లి వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని 400 ఏళ్ల నాటి రంగనాథస్వామి ఆలయంలో సింపుల్‌గా జరిగింది. పెళ్లికి ముందు ఓ ఆంగ్ల పత్రిక వోగ్‌తో మాట్లాడిన ఈ జంట, తమ వ్యక్తిగత జీవితం గురించి కొన్ని ఆసక్తికర విషయాలను తెలిపారు. తాను సాధారణంగా సూర్యోదయానికి ముందు నిద్ర లేవడం ఇష్టం ఉండదని, కానీ అదితి మాత్రం ఉదయం నిద్రలేసి, నా నుంచి నిద్రను లాగేసుకుంటుందని సిద్ధార్థ్ చెప్పారు. ఉదయం వేళలో ప్రతి క్షణాన్ని ఆస్వాదించమని అదితి ఎప్పుడూ చెబుతుంటుందని పేర్కొన్నారు.

Details

ముందుగా నేనే సారి చెబుతా : అదితి

సిద్ధార్థ్ క్యాజువల్ డ్రెస్లో ఉంటే తనకు చాలా ఇష్టమని, ఇక ఫ్యాషన్ దుస్తుల్లో అయితే చాలా స్టైలిష్‌గా ఉంటాడని, మా మధ్య గొడవలు జరిగితే ముందుగా తానే సారీ చెబుతానని అదితి చెప్పారు. 'మహా సముద్రం' చిత్రంలో వీరిద్దరూ కలిసి నటించారు. సినిమా షూటింగ్‌లో ఏర్పడిన స్నేహం, అది కాస్త ప్రేమగా మారింది. తాజాగా పెళ్లి బంధంతో వీరిద్దరూ ఒక్కటయ్యారు. ఇద్దరికీ ఇది రెండో పెళ్లి కావడం విశేషం.