Adivi Sesh: నా సినిమాల వల్ల ఏ నిర్మాత నష్టపోలేదు.. అడివి శేష్ కామెంట్స్ వైరల్
ఈ వార్తాకథనం ఏంటి
వరుస విజయాలతో బాక్సాఫీస్ వద్ద ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న హీరో అడివి శేష్. ఇప్పుడు తన తదుపరి చిత్రం 'డెకాయిట్' తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్‌తో ఆయన కెమిస్ట్రీ ప్రధాన ఆకర్షణగా మారబోతోంది. ఏప్రిల్ 10న ఈ సినిమా రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో, శేష్ వరుసగా ప్రమోషన్లలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంలో ఒక ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణంలోని ముఖ్యమైన అంశాలను పంచుకున్నారు.
వివరాలు
ఆ సినిమా వల్లే విజయం దక్కింది...
ప్రత్యేకంగా, తన సినిమాలను నమ్మి పెట్టుబడి పెట్టిన నిర్మాతలకు ఇప్పటివరకు నష్టాలు రాలేదని గర్వంగా చెప్పారు. ఇప్పటివరకు తన ప్రొడ్యూసర్స్ అందరూ లాభాలు పొందారన్నారు. వాళ్ళు పెట్టిన ప్రతి రూపాయికి విలువ పెరిగిందన్నారు. నటుడిగా మాత్రమే కాదు, స్క్రిప్ట్ ఎంపిక విషయంలో కూడా శేష్ చూపించే జాగ్రత్త ఇండస్ట్రీ వర్గాలను ఆకర్షిస్తోంది. "గూఢచారి నా జీవితాన్ని పూర్తిగా మార్చింది. ఆ సినిమా ఇచ్చిన విజయం కారణంగా, ఈరోజు నేను పెద్ద ప్రాజెక్టులలో కూడా పని చేయగలుగుతున్నాను," అని ఎమోషనల్ అయ్యారు అడివి శేష్.