మెగా హీరో వరుణ్ తేజ్ ఇంట మోగనున్న పెళ్ళి బాజాలు
టాలీవుడ్ లో వరుస పెళ్ళిళ్ల పర్వం మరోసారి ఊపందుకోనుంది. అప్పట్లో కరోనా టైమ్ లో వరుసపెట్టి పెళ్ళిళ్ళు జరిగాయి. మరికొద్ది రోజుల్లో అదే తీరు మళ్ళీ పునరావృతం అయ్యే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. మొన్నటికి మొన్న హీరో శర్వానంద్ నిశ్చితార్థం, సాఫ్ట్ వేర్ ఇంజనీర్ రక్షిత రెడ్డితో జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా మెగా హీరో వరుణ్ తేజ్ పెళ్ళి గురించి వార్తలు వస్తున్నాయి. ఒకానొక ఇంటర్వ్యూలో మాట్లాడిన వరుణ్ తేజ్ తండ్రి నాగబాబు, మరికొద్ది రోజుల్లో వరుణ్ పెళ్ళి ఉండనుందని, ఈ సంవత్సరంలో పెళ్ళి చేస్తామని చెప్పుకొచ్చాడు. ఇంకా, పెళ్ళి విషయంలో నిర్ణయం వరుణ్ దే అనీ, ఏ నిర్ణయమైనా తీసుకునే స్వేఛ్ఛను పిల్లలకు ఇచ్చానని నాగబాబు అన్నారు.
ఫ్యామిలీ క్లబ్ లోకి సాయి ధరమ్ తేజ్ కూడా చేరిపోతాడా?
పెళ్ళి విషయంలో వరుణ్ ఇష్టమే తమ ఇష్టమని నాగబాబు చెప్పడంతో, వరుణ్ తేజ్ లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నారని సోషల్ మీడియాలో వార్తలు పుట్టుకొచ్చాయి. ఇక్కడ మరో విషయం ఏంటంటే వరుణ్ తేజ్ పెళ్ళి కన్ఫర్మ్ అయితే మరో ఇద్దరు మెగా ఫ్యామిలీకి చెందిన హీరోల పెళ్ళిళ్ళు అయ్యే అవకాశం ఉందని అనుకుంటున్నారు. వరుణ్ పెళ్ళి గురించి వార్త వచ్చినప్పటి నుండి సాయి ధరమ్ తేజ్ పెళ్ళి విషయమై మాటలు వినిపిస్తున్నాయి. వరుణ్ తేజ్ కంటే సాయి ధరమ్ తేజ్ వయసులో పెద్ద కాబట్టి, మరికొద్ది రోజుల్లో సాయి తేజ్ పెళ్ళి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అదీగాక అల్లు శిరీష్ పెళ్ళి కూడా ఈ సంవత్సరంలో ఉంటుందని అల్లు అరవింద్ ఇంతకుముందు ప్రకటించారు.