
Vaishnavi : 'లవ్ మీ' డిజాస్టర్ తర్వాత.. 'జాక్'తో వైష్ణవి కెరీర్ సెట్టవుతుందా?
ఈ వార్తాకథనం ఏంటి
యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ఎంతోమంది టాలెంటెడ్ ఆర్టిస్టులు వెలుగులోకి వస్తున్నారు. వీరికి డిజిటల్ వేదికగా క్రేజ్ పెరగడంతో, టార్గెట్ నేరుగా బిగ్ స్క్రీన్‌పై పడుతోంది.
ఇటువంటి పరిణామాల్లో రీసెంట్‌గా వెలుగులోకి వచ్చిన ముద్దుగుమ్మ వైష్ణవి చైతన్య.
యూట్యూబ్‌లో షార్ట్ ఫిల్మ్‌లు చేస్తూ, ఇన్‌స్టాలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్‌గా పేరు తెచ్చుకున్న వైష్ణవి, సాఫ్ట్ వేర్ డెవలపర్, మిస్సమ్మ వంటి షార్ట్ ఫిల్మ్‌లతో మంచి గుర్తింపు సంపాదించింది.
ఆ గుర్తింపుతో సిల్వర్ స్క్రీన్‌కు ఎంట్రీ ఇచ్చిన ఆమె, 'టచ్ చేసి చూడు' మూవీలో చిన్న పాత్రలో కనిపించింది.
Details
'బేబి'తో క్రేజ్, హేట్రెట్ రెండూ
అయితే ఆమెకు అసలైన ఫేమ్ తెచ్చిన చిత్రం 'బేబి'. ఈ సినిమాలో వైష్ణవి పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నా ఆమె పాత్రకు మిశ్రమ స్పందన వచ్చింది.
కొంతమంది ప్రశంసిస్తే, మరికొందరు విమర్శలు చేశారు. అయినా ఈ మూవీ విజయంతో వైష్ణవి తన స్థానాన్ని నిలబెట్టుకుంది.
అదే సమయంలో బేబీ నిర్మాతతో మరో రెండు ప్రాజెక్టులు చేసేందుకు ఛాన్స్ దక్కించుకుంది.
'లవ్ మీ' డిజాస్టర్, 'జాక్'పై భారీ ఆశలు!
'బేబి' తర్వాత వచ్చిన లవ్ మీ చిత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది.
అదే సమయంలో 'జాక్' మూవీ ఆమెకు గోల్డెన్ ఛాన్స్‌గా మారింది. ఈ సినిమాలో సిద్ధూ జొన్నలగడ్డ సరసన నటిస్తోంది.
సిద్ధూను 'టిల్లు' ఫ్రాంచైజీతో యూత్‌లో ఎంతటి క్రేజ్ సంపాదించుకున్నాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
Details
వైషూ కెరీర్ మలుపు తిరుగుతుందా?
ఇప్పటి వరకు ఆనంద్ దేవరకొండ, ఆశిష్ లాంటి జూనియర్ హీరోలతో నటించిన వైష్ణవి, ఇప్పుడు మొదటిసారి ఒక స్టార్ హీరోతో జోడీ కడుతోంది.
పైగా, రీసెంట్‌గా ఆమె ఆనంద్ దేవరకొండతో మరో మూవీ కమిట్ అయ్యిందని టాక్. అయితే లవ్ మీ సినిమా ఆశించిన స్థాయిలో లేకపోవడంతో, 'జాక్' మూవీపై భారీగా ఆశలు పెట్టుకుంది.
సిద్ధూ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ అందించిన 'టిల్లు' లాంటి క్రేజ్, ఈ మూవీకి కూడా వస్తే, వైష్ణవి కెరీర్ మళ్లీ ట్రాక్‌లోకి వచ్చే అవకాశం ఉంది.
జాక్ హిట్ అయితే, ఆమెకు పెద్ద హీరోల సినిమాల్లో అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంది. ఇక వైష్ణవి ఫ్యూచర్ 'జాక్' ఫలితంపై ఆధారపడి ఉందని చెప్పొచ్చు!