Peddi: 'పెద్ది' ట్రైలర్ తర్వాత మరో బిగ్ సర్ప్రైజ్.. మెగా ఫ్యాన్స్‌కు ట్రీట్ రెడీ!
ఈ వార్తాకథనం ఏంటి
'పెద్ది' చిత్రంపై రోజురోజుకీ అంచనాలు పెరుగుతున్న వేళ, మేకర్స్ వరుస అప్‌డేట్స్‌తో అభిమానుల్లో మరింత హైప్ క్రియేట్ చేస్తున్నారు. రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ పాన్ ఇండియా స్పోర్ట్స్ డ్రామా కోసం మెగా అభిమానులతో పాటు సినీ ప్రియులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ లాంచ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించిన మేకర్స్.. తాజాగా మరో క్రేజీ అప్‌డేట్‌ను వెల్లడించారు. ట్రైలర్ విడుదలైన వెంటనే ప్రేక్షకులను అలరించేలా ఓ స్పెషల్ సాంగ్‌ను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ ప్రత్యేక గీతంలో రామ్ చరణ్, జాన్వీకపూర్ తో పాటు గ్లామరస్ స్టార్ శృతి హాసన్ కూడా కనిపించనుంది.
వివరాలు
జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్
దీంతో ఈ పాటపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు ఆస్కార్ విజేత ఏఆర్. రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండటంతో, ఈ స్పెషల్ సాంగ్ మ్యూజిక్ పరంగా మరో స్థాయిలో ఉండబోతుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ పాట విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నట్లు సమాచారం. వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రామ్ చరణ్ కెరీర్‌లో వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందోనని సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.