Page Loader
Happy Birthday Surya: 'పెరుగుతున్న వయసు.. తగ్గని ఎనర్జీ'.. సూర్య ఫిట్‌నెస్ రహాస్యమిదే!
'పెరుగుతున్న వయసు.. తగ్గని ఎనర్జీ'.. సూర్య ఫిట్‌నెస్ రహాస్యమిదే!

Happy Birthday Surya: 'పెరుగుతున్న వయసు.. తగ్గని ఎనర్జీ'.. సూర్య ఫిట్‌నెస్ రహాస్యమిదే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 23, 2025
02:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ నటుడు సూర్య నేడు తన 50వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ వయస్సులోనూ ఆయన లీన్ ఫిజిక్ ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తోంది. సమతుల్యమైన ఆహారం, క్రమమైన వ్యాయామం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, సూర్య తన జీవనశైలిలో ఆరోగ్యంపై ఎంతటి నిబద్ధతతో ఉన్నారో స్పష్టంగా చూపిస్తున్నారు. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని, 50 ఏళ్ల వయసులోనూ ఆయన ఫిట్‌నెస్‌ను ఎలా మెయింటెయిన్ చేస్తారో తెలుసుకుందాం.

Details

'కంగువ' కోసం 100 రోజుల ట్రాన్స్‌ఫర్మేషన్

మే 5న 'మన స్టార్స్‌'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సూర్య మాట్లాడుతూ 'కంగువ' సినిమాలోని ఓ కీలక యుద్ధ సన్నివేశం కోసం తన ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఎంతటి కఠినమైనదో వెల్లడించారు. సాధారణంగా ఫిట్‌నెస్‌ తన జీవితంలో ఒక భాగమే అయినప్పటికీ, ఈ సారి అది అతని కెరీర్‌లో అత్యంత కఠినమైన సవాలుగా నిలిచిందని తెలిపారు. 30 ఏళ్ల వయసులో ఇది చదునైన రోడ్డుపై పరుగెత్తినట్లే. కానీ ఇప్పుడు 49 ఏళ్ల వయసులో పర్వతం ఎక్కినట్లు అనిపించిందని పేర్కొన్నారు. ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ కోసం ఆయన 100 రోజుల ప్రణాళికను పాటించారు. ఇది కేవలం జిమ్‌ వరకే పరిమితం కాకుండా, జీవనశైలిలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఏర్పడిందని చెప్పారు.

Details

40 ఏళ్ల తర్వాత ఆరోగ్యంపై కొత్త దృష్టికోణం

సూర్య దినచర్యలో కఠినమైన స్వీయ క్రమశిక్షణ, క్యాలరీ డెఫిసిట్ డైట్, ఎక్కువ కార్డియో సెషన్లు, తదితరాలు ఉన్నాయి. షూటింగ్ సమయంలో నేను ఆ 100 రోజుల ప్రణాళికను పూర్తిగా పాటించాను. సిక్స్ ప్యాక్ ఫిజిక్‌ను పూర్తిగా సహజ మార్గాల్లోనే సాధించానని ఆయన తెలిపారు. తన గురించి మాట్లాడుతూ సూర్య తనను తాను ఫుడీగా చెప్పుకుంటారు. అయితే తల్లిదండ్రులవల్ల తనకు బరువు పెరగని శరీర స్వభావం ఉన్నప్పటికీ, ఇది తేలికగా సాధించదగ్గ విషయం కాదని స్పష్టం చేశారు. దాదాపు పదేళ్ల తర్వాత సిక్స్ ప్యాక్ సాధించడం ఎంతటి క్రమశిక్షణ, ఓర్పును డిమాండ్ చేసిందో వివరించారు.

Details

సూర్య - సినీ జీవితంపై ఓ చూపు

సూర్య అసలు పేరు శరవణన్ శివకుమార్. నటుడిగా, నిర్మాతగా ఆయన తమిళ, తెలుగు సినీ పరిశ్రమల్లో తనదైన గుర్తింపును సంపాదించుకున్నారు. అత్యధిక పారితోషికం అందుకునే నటులలో ఒకరిగా నిలిచిన సూర్య, భారతీయ సినిమాలో అత్యుత్తమ ప్రతిభావంతులలో ఒకరుగా ప్రశంసలు అందుకున్నారు. ఆయన 50వ వసంతంలోకి అడుగుపెట్టిన ఈ ప్రత్యేక సందర్భంలో, ఆయన ఆరోగ్య పరిరక్షణకు తీసుకునే శ్రమ, స్ఫూర్తిదాయక జీవనశైలి ప్రతి ఒక్కరికి మార్గదర్శకంగా నిలవనుంది.