అల్లు అర్జున్ చంకనెక్కిన శ్రీలీల: కొత్త పోస్టర్ చెప్పే కథేంటి?
పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్న అల్లు అర్జున్, చేతిలో అరడజనుకు పైగా సినిమాలున్న శ్రీలీల కలిసి సినిమా చేస్తున్నారా అన్న సందేహాలను సృష్టిస్తూ కొత్త పోస్టర్ ను ఆహా టీమ్ రిలీజ్ చేసింది. అహా ఒరిజినల్ కోసం హీరోయిన్ ని పరిచయం చేయబోతున్నామని నిన్న సాయంత్రం ప్రకటించి ఈరోజు ఉదయం, శ్రీలీలను చంకలో ఎత్తుకున్న అల్లు అర్జున్ పోస్టర్ ను విడుదల చేసారు. ఈ పోస్టర్ ని రిలీజ్ చేసిన ఆహా, వీరిద్దరూ స్టెప్పులేస్తే బొమ్మ బ్లాక్ బస్టర్ అవుతుందని కామెంట్ పెట్టింది. దీంతో ప్రేక్షకుల్లో కన్ఫ్యూజన్ మొదలైంది. అల్లు అర్జున్, శ్రీలీల కలిసి సినిమా చేయబోతున్నారా అన్న అనుమానం మొదలైంది. ప్రస్తుతం ఈ విషయమై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
యాడ్ ఫిలిమ్ అంటున్న నెటిజన్లు
పుష్ప 2 పూర్తి కాగానే త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయడానికి అల్లు అర్జున్ సిద్ధమవుతున్నాడని టాక్ వినిపిస్తోంది. ఆ సినిమాకు సంబంధించిన స్టిల్ అయ్యుంటుందేమోనని కొందరు అనుమానపడుతున్నారు. మరికొందరు మాత్రం, అల్లు అర్జున్, శ్రీలీల కలిసి ఆహా కోసం స్పెషల్ సాంగ్ లో కనిపించనున్నారని, దానికి సంబంధించిన స్టిల్ ఇదేనని అంటున్నారు. ఇంకొందరేమో ఆహా కోసం షూట్ చేసే యాడ్ ఫిలిమ్ కి సంబంధించిన స్టిల్ అని చెబుతున్నారు. మరి ఈ మూడింట్లో దేనికి సంబంధించిందో తెలియాలంటే ఆహా నుండి క్లారిటీ రావాలి. అదెప్పుడు వస్తుందో చూడాలి.