Unstoppable with NBK S4 : బాలయ్యతో వెంకీ.. అన్‌స్టాపబుల్ షో ప్రొమో విడుదల
బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న"అన్‌స్టాపబుల్"షో ఆహా ఓటీటీలో మంచి స్పందనను పొందుతోంది. మూడు సీజన్లు పూర్తయి,ప్రస్తుతం నాలుగో సీజన్ కొనసాగుతుంది.ఈ సీజన్‌లో 7వ ఎపిసోడ్‌కు విక్టరీ వెంకటేష్ అతిథిగా వచ్చారు. ఆయన నటిస్తున్న చిత్రం'సంక్రాంతికి వస్తున్నాం'ప్రమోషన్ల భాగంగా ఈ షోలో సందడి చేశారు. తాజాగా ఆహా ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రొమోను విడుదల చేసింది. ప్రొమోలో,బాలకృష్ణ విక్టరీ వెంకటేష్‌నుస్టేజీపైకి పిలిచి,"పోటీనా మనం...ఒకరికి ఒకరు"అంటూ అడిగారు. దీనికి స్పందించిన వెంకటేష్,"ఎక్కడమ్మా పోటీ"అని చెప్పారు. ఈ ప్రొమోను చూస్తుంటే, విక్టరీ వెంకటేష్ సర్దాగా సరదా విషయాలు పంచుకునే సమయంలో,పలు సీరియస్ విషయాలను కూడా వెల్లడించారనిపిస్తుంది. ప్రొమో చివరలో,దర్శకుడు అనిల్ రావిపూడి కూడా కనిపించారు.ఈఎపిసోడ్ డిసెంబర్ 27 రాత్రి 7 గంటలకు ఆహా వేదికగా స్ట్రీమింగ్ కానుంది.