Aishwarya Rai: ఐశ్వర్య రాయ్ డీప్‌ఫేక్ వీడియో వైరల్.. సల్మాన్ పాటకు డ్యాన్స్
డీప్‌ఫేక్ వీడియోలు కొన్నిరోజులుగా చర్చనీయాంశంగా మారాయి. మొదట రష్మిక మందన్న అసభ్యకర డీప్‌ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. తర్వాత సచిన్ కుమార్తె సారా టెండూల్కర్ డీప్‌ఫేక్‌కు బలైంది. తాజాగా ఐశ్వర్యరాయ్ బచ్చన్ డీప్‌ఫేక్ టెక్నాలజీ బారిన పడింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. సల్మాన్ చిత్రం టైగర్ 3లోని పాటకు ఐశ్వర్య డ్యాన్స్ చేస్తున్నట్లు ఆ వీడియోలో కనిపించింది. ఈ వీడియోను జాగ్రత్తగా గమనిస్తే మీకు రెండు విషయాలు అర్థమవుతాయి. మొదటిది, వీడియోలో ఐశ్వర్యరాయ్ ముఖాన్ని ఎడిట్ చేసారు. రెండోది, వీడియోలోని డ్యాన్స్ సల్మాన్ సినిమాలోని సాంగ్ కాదు. వేరే పాటకు వేసిన స్టెప్పులను దీనికి లింకు చేశారు. ఈ వీడియోలో ఉన్నది అదితి పండిత్‌గా ఫ్యాక్ట్ చెక్‌లో తేలింది.