Aishwarya Rajinikanth: రజనీకాంత్ బయోపిక్: అప్‌డేట్ చెప్పిన ఐశ్వర్య
ఈ వార్తాకథనం ఏంటి
రజనీకాంత్ (Rajinikanth) కేవలం నటుడిగా మాత్రమే కాదు, వ్యక్తిగతంగా కూడా ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. బస్ కండక్టర్‌గా ప్రారంభించిన తన ప్రయాణం సూపర్‌స్టార్ స్థాయికి చేరేవరకూ స్ఫూర్తిదాయకంగా నిలిచింది. కొన్నాళ్ల క్రితం రజనీకాంత్ జీవితంపై బయోపిక్ రూపొందుతుందని వార్తలు హల్‌చల్ చేసాయి, కానీ ఆ బయోపిక్ గురించి అధికారిక ప్రకటన కూడా లేదు. అయితే తాజాగా, రజనీ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ అభిమానులకు సంతోషకరమైన వార్తను వెల్లడించారు. తన తండ్రి ఆటోబయోగ్రఫీపై పని ఇప్పటికే ప్రారంభించారని ఆమె వెల్లడించారు. ఈ బుక్ ప్రపంచవ్యాప్తంగా ఆకట్టుకునే విధంగా మారుతుందని ఒక ఇంటర్వ్యూలో ఐశ్వర్య చెప్పారు.
వివరాలు
'విత్ లవ్'కు నిర్మాతగా ఐశ్వర్య
సూపర్‌స్టార్ కుమార్తెగా ఉండటం తేలికైన విషయం కాదని, ఒక ప్రశ్నకు సమాధానంగా ఐశ్వర్య చెప్పారు. సినిమా పరిశ్రమలో ఏఐ (Artificial Intelligence)వాడకం మంచి మార్పు తీసుకురాగలిగినప్పటికీ, అది ఎప్పటికీ కృత్రిమమే అనే విషయం గుర్తుంచుకోవాలి అని ఆమె అభిప్రాయపడ్డారు. 'కోచ్చాడయాన్' (2014)వంటి సినిమాలు రూపొందించడం తనకు ఇష్టమని,ఇప్పుడు ఆధునిక సాంకేతికత వల్ల అలాంటి చిత్రాలను తేలికగా తీయగలమని ఆమె పేర్కొన్నారు. '3', 'లాల్ సలామ్' వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన ఐశ్వర్య,తాజా ప్రాజెక్ట్ 'విత్ లవ్' (With Love) కు నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రం'టూరిస్ట్ ఫ్యామిలీ' డైరెక్టర్ అభిషన్ జీవింత్ హీరోగా,మదన్ నిర్మించిన రొమాంటిక్ మూవీగా రూపొందింది. హీరోయిన్‌గా అనస్వర రాజన్ నటించారు.ఈ సినిమా తెలుగులో ఫిబ్రవరి 6న విడుదల కానుంది.