LOADING...
Aishwarya Rai: కేన్స్‌లో మరోసారి మెరవనున్న ఐశ్వర్య.. సోషల్‌ మీడియా ప్రచారాలకు ఫుల్‌స్టాప్
కేన్స్‌లో మరోసారి మెరవనున్న ఐశ్వర్య.. సోషల్‌ మీడియా ప్రచారాలకు ఫుల్‌స్టాప్

Aishwarya Rai: కేన్స్‌లో మరోసారి మెరవనున్న ఐశ్వర్య.. సోషల్‌ మీడియా ప్రచారాలకు ఫుల్‌స్టాప్

వ్రాసిన వారు Jayachandra Akuri
May 22, 2026
09:00 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచ సినీ ప్రియుల దృష్టిని ఆకర్షించే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో బాలీవుడ్‌ స్టార్‌ ఐశ్వర్య రాయ్ బచ్చన్ ఎప్పుడూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటారు. అయితే ఈసారి ఆమె కేన్స్‌కు హాజరుకావడం లేదంటూ గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో జోరుగా ప్రచారం సాగింది. ఈ రూమర్స్‌కు ఫుల్‌స్టాప్‌ పెడుతూ ఐశ్వర్య తన కుమార్తెతో కలిసి ఫ్రాన్స్‌కు బయల్దేరారు. దీంతో కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ చివరి రోజు వేడుకల్లో ఆమె సందడి చేయనున్నట్లు స్పష్టమైంది.

వివరాలు

అభిమానుల్లో పెరిగిన ఉత్సాహం

ప్రతేడాది ఒక ప్రముఖ బ్రాండ్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ కేన్స్‌ రెడ్‌ కార్పెట్‌పై తన అందంతో మెస్మరైజ్‌ చేసే ఐశ్వర్య ఈసారి ఆ బ్రాండ్‌ ప్రచార కార్యక్రమాల్లో కనిపించకపోవడంతో అనేక ఊహాగానాలు మొదలయ్యాయి. ఆమె స్థానంలో ఈసారి బాలీవుడ్‌ నటి అలియా భట్ పాల్గొంటున్నారంటూ కథనాలు వెలువడ్డాయి. దీంతో ఐశ్వర్య అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే తాజాగా ఆమె ముంబయి విమానాశ్రయంలో దర్శనమివ్వడంతో అభిమానుల్లో మళ్లీ ఉత్సాహం నెలకొంది. ఈసారి కేన్స్‌ రెడ్‌ కార్పెట్‌పై ఐశ్వర్య ఎలాంటి కొత్త లుక్స్‌తో అలరించనున్నారో అన్న ఆసక్తి ఇప్పుడు అందరిలో కనిపిస్తోంది.

వివరాలు

చీరలో మెరిసిన ఐశ్వర్యరాయ్

2002లో తొలిసారి కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు హాజరైన ఐశ్వర్య అప్పటి నుంచి ప్రతి ఏడాది తన ప్రత్యేకమైన ఫ్యాషన్‌ స్టేట్‌మెంట్‌తో ఆకట్టుకుంటూనే ఉన్నారు. ముఖ్యంగా గతేడాది భారతీయ సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా చీరలో మెరిసిన ఆమె, నుదుటిపై సింధూరంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అంతేకాదు, పహల్గాం ఘటనకు ప్రతీకారంగా భారత్‌ చేపట్టిన 'ఆపరేషన్‌ సిందూర్‌'కు తన లుక్‌ ద్వారా మద్దతు తెలిపినట్లు అప్పట్లో విస్తృత చర్చ జరిగింది. దీంతో ఆమె కేన్స్‌ వేదికపై మరోసారి సెంటర్‌ ఆఫ్‌ ఎట్రాక్షన్‌గా మారారు.

Advertisement