Page Loader
Saithaan-Ajay Devagan-Ott: ఓటీటీలోకి అజయ్ దేవగన్ లేటెస్ట్ హర్రర్ మూవీ సైతాన్

Saithaan-Ajay Devagan-Ott: ఓటీటీలోకి అజయ్ దేవగన్ లేటెస్ట్ హర్రర్ మూవీ సైతాన్

వ్రాసిన వారు Stalin
Apr 15, 2024
01:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇప్పుడు ట్రెండ్ మారింది. ఏ సినిమా విడుదలైనా హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా నెలరోజుల్లోనే ఓటీటీ ప్లాట్ ఫాంలోకి వచ్చేస్తోంది. సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నా థియేట్రికల్ రన్ నెలరోజులకు పడిపోయింది. కోవిడ్ సమయంలో ఓటీటీలకు అలవాటు పడిన మన ప్రేక్షకులు సినిమాకు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. అందుకే మేకర్స్ సినిమా ఎంత పెద్ద హిట్ అయినా నెలరోజుల్లోనే ఓటీటీ లకు ఇచ్చేస్తున్నారు. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ (Ajay Devgan) హీరోగా నటించిన హర్రర్ మూవీ సైతాన్ (Sythaan) ఈనెలలో ఓటీటీలోకి వచ్చేయనుంది. మార్చి 8న విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద 200 కోట్ల రూపాయల కలెక్షన్లను కొల్లగొట్టింది.

Sythaan on Net Flix

వచ్చే నెల 3 నుంచి నెట్​ ఫ్లిక్స్​ లో స్ట్రీమింగ్

డైరెక్టర్ వికాస్ బహ్ల్ (vikas Bahle) రూపొందించిన ఈ సైతాన్ సినిమాలో తమిళ నటులు జ్యోతిక (jyothika), మాధవన్ (Madhavan) కీలక పాత్రలో నటించారు. సినిమా మొత్తం థ్రిల్లింగ్స్ సీన్స్ తోపాటు ఎక్కడికక్కడ కొత్త దనంతో భయపెట్టే సీన్లు ఉండటంతో ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మ రథం పట్టారు. ఈ సైతాన్ సినిమా డిజిటల్ హక్కుల్ని ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ (Net Flix) సంస్థ దక్కించుకుంది. వచ్చే నెల 3 వ తేదీ నుంచి ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.