
Ajit kumar: బెల్జియం ఐకానిక్ రేసింగ్ ఈవెంట్‌లో మరో రికార్డు నెలకొల్పిన అజిత్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ నటుడు అజిత్ కుమార్ ఒక ప్రొఫెషనల్ రేసర్ అన్న విషయం అందరికీ తెలిసిందే.
సినిమాల షూటింగ్స్ లేని సమయంలో ఆయన ఎక్కువగా బైక్స్, కార్ల రేసింగ్‌ద్వారానే తన సమయాన్ని గడిపేస్తుంటారు.
తాజాగా, తన టీమ్‌తో కలిసి మరో విశేషమైన విజయాన్ని అందుకున్నారు. బెల్జియంలోని ప్రసిద్ధ స్పా-ఫ్రాన్‌కోర్‌ఛాంప్స్ సర్క్యూట్‌లో జరిగిన రేస్‌లో అజిత్ టీమ్ రెండవ స్థానాన్ని సంపాదించింది.
ఈ విషయాన్ని టీమ్ సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ తమ ఆనందాన్ని వ్యక్తపరిచింది.
అజిత్ ఎక్కడ ఉన్నా, అది సినిమా అయినా, క్రీడల, అక్కడ ఓ ప్రత్యేకమైన పాజిటివ్ ఎనర్జీ ఉంటుందంటూ ప్రశంసలు వెల్లువెత్తాయి.
వివరాలు
అజిత్‌ను అభినందించిన మైత్రీ మూవీ మేకర్స్
తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కూడా అజిత్‌ను అభినందించింది.
ఇది గొప్ప విజయమని, అజిత్ పేరు గర్వించదగిన స్థాయిలో ప్రతిభను చూపారంటూ మెచ్చుకున్నారు.
ఈ విజయాన్ని పురస్కరించుకుని అనేక మంది సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు అజిత్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
ఇది కాకుండా,ఈ ఏడాది జనవరిలో జరిగిన 24గంటల దుబాయ్ కార్ రేసింగ్ ఈవెంట్‌లో కూడా అజిత్ పాల్గొన్న విషయం విదితమే.
ఆ పోటీలో ఆయన టీమ్ మూడవ స్థానాన్ని సాధించింది.
వివరాలు
ఇటలీలో మూడో స్థానం
ఇటలీలో ఇటీవల నిర్వహించిన 12గంటల రేస్‌లోనూ అదే స్థాయిలో మూడో స్థానం దక్కించుకున్నారు.
సినిమాల పరంగా చూస్తే, ఈ సంవత్సరంలో ఇప్పటికే 'పట్టుదల' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
అలాగే, 'గుడ్ బ్యాడ్ అగ్లీ' అనే చిత్రం ఈ నెల 10న విడుదలై మంచి స్పందన పొందింది. ఈ సినిమా ఇప్పటికే రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి విజయబాటలో దూసుకుపోతోంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
బెల్జియం ఐకానిక్ రేసింగ్ ఈవెంట్‌లో అజిత్
A celebration of P2 in Spa-Francorchamps Belgium @Akracingoffl Ajith sir and team drivers.
— Ajith (@ajithFC) April 20, 2025
Video: RedAntRacing | #AK #Ajith #Ajithkumar | #GoodBadUgly | #AjithKumarRacing | #24HSeries | #AKRacing | pic.twitter.com/o4n9hLXgtC