Page Loader
Akash Puri: పెళ్లి పీటలు ఎక్కనున్న పూరీ జగన్నాథ్ కొడుకు.. ఆ పొలిటికల్ ఫ్యామిలీతో సంబంధం!
పెళ్లి పీటలు ఎక్కనున్న పూరీ జగన్నాథ్ కొడుకు.. ఆ పొలిటికల్ ఫ్యామిలీతో సంబంధం!

Akash Puri: పెళ్లి పీటలు ఎక్కనున్న పూరీ జగన్నాథ్ కొడుకు.. ఆ పొలిటికల్ ఫ్యామిలీతో సంబంధం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 22, 2023
03:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్ లో డేరింగ్ అండ్ డాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్(Puri Jagannath) తనయుడు ఆకాశ్ పూరి (Akash Puri) త్వరలో పెళ్లి పీటలు ఎక్కుతున్నట్లు సమాచారం. ఆకాశ్ పూరిది లవ్ మ్యారేజ్ అని, తన చిన్ననాటి క్లాస్ మేట్‌ను ఆకాశ్ పెళ్లి చేసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. ఇంతకీ ఆకాశ్ పెళ్లాడే అమ్మాయి ఎవరో తెలుసుకుందాం..? ఆకాశ్ పూరి పెళ్లి చేసుకొనే అమ్మాయి ఒక పొలికటల్ సీనియర్ లీడర్ మనవరాలు అని, ఆమెకు కోట్లకు ఆస్తిపరులని చెబుతున్నారు. వీరికి త్వరలో ఎంగేజ్ మెంట్ ఉంటుందని, వచ్చే ఏడాది పెళ్లి కూడా చేసుకుంటారని జోరుగా ప్రచారం సాగుతోంది.

Details

సంతోషం వ్యక్తం చేస్తున్న ఆకాశ్ పూరీ ఫ్యాన్స్

దీనిపై ఇరు కుటుంబ సభ్యులు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. మరోవైపు కుటుంబ సభ్యులు ఒప్పుకున్న తర్వాతే ఈ న్యూస్ లీకైనట్లు తెలుస్తోంది. ఆకాశ్ పూరి టాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆంధ్రాపోరితో హీరోగా మారిన తర్వాత మెహబూబా, రొమాంటిక్, చోర్ బజార్ అనే సినిమాలను చేశారు. హీరోగా నాలుగు సినిమాలు చేసిన ఆకాశ్ పూరీకి సరైన హిట్ పడలేదు. ఏది ఏమైనా ఆకాష్ పూరీ వివాహం చేసుకుంటారని తెలిసి అతని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.