NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Akhanda2: అఖండ 2 పోస్టర్ రిలీజ్.. మరోసారి బాలయ్య, బోయపాటి కాంబో 
    తదుపరి వార్తా కథనం
    Akhanda2: అఖండ 2 పోస్టర్ రిలీజ్.. మరోసారి బాలయ్య, బోయపాటి కాంబో 
    అఖండ 2 పోస్టర్ రిలీజ్.. మరోసారి బాలయ్య, బోయపాటి కాంబో

    Akhanda2: అఖండ 2 పోస్టర్ రిలీజ్.. మరోసారి బాలయ్య, బోయపాటి కాంబో 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Oct 16, 2024
    09:36 am

    ఈ వార్తాకథనం ఏంటి

    నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే నందమూరి ఫ్యాన్స్ కు పండగలా ఉంటుంది.

    వీరి కాంబోలో సింహ, లెజెండ్, అఖండ వంటి మాస్ ఎంటర్‌టైనర్లు ప్రేక్షకులను అలరించి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించారు.

    లాక్‌డౌన్ సమయంలో విడుదలైన అఖండ చిత్రం బాలయ్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా రికార్డుకెక్కింది. ఈ చిత్రం విజయంతో, సీక్వెల్ పై కూడా ఆసక్తి పెరిగింది.

    మేకర్స్ అప్పటికే సీక్వెల్ ఉంటుందని ప్రకటించారు. తాజాగా 'అఖండ 2 - తాండవం' పేరుతో ఈ సీక్వెల్ రాబోతుందని మేకర్స్ స్పష్టం చేశారు.

    తాజా టైటిల్ పోస్టర్‌లో 'తాండవం' అనే ట్యాగ్‌లైన్‌తో అఖండ 2 టైటిల్‌ను ఫైనల్ చేశారు. కథ మొదటి భాగం ముగిసిన చోటు నుంచి కొనసాగనుంది.

    Details

    అఖండ 2పై భారీ అంచనాలు

    అఖండ పాత్ర కుమార్తె పెద్దయ్యాక జరిగే కథనమని, ఈ సీక్వెల్‌లో ప్రధానంగా ఉంటుందని తెలుస్తోంది. బుధవారం పూజా కార్యక్రమాలతో అఖండ 2 మొదలుకానుంది.

    బాలకృష్ణ ఇటీవల వరుస హిట్స్ కొడుతుండడంతో అఖండ 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

    బోయపాటి శ్రీను, స్కంద చిత్రం నిరాశ పరచిన తర్వాత, ఈ సినిమాను మరోసారి భారీ హిట్‌గా నిలబెట్టే యత్నంలో ఉన్నారు. ప్రస్తుతానికి బాలకృష్ణ బాబీ దర్శకత్వంలో మరో సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.

    ఈ ప్రాజెక్టు పూర్తయ్యాక వెంటనే అఖండ 2 షూటింగ్‌లో పాల్గొంటారు. తమన్ సంగీతం అందిస్తుండగా, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నందమూరి బాలకృష్ణ
    బోయపాటి శ్రీను

    తాజా

    Agroterrorism Weapon: చైనా ల్యాబ్‌లో డేంజర్‌ ఫంగస్‌ సృష్టి? అమెరికాలో ఇద్దరు శాస్త్రవేత్తల అరెస్ట్‌.. అమెరికా
    Gold Rate: తెలుగు రాష్ట్రాల్లో పసిడి పరుగులు.. రూ. 99 వేలకి చేరువ! బంగారం
    Pakistan: భారత కార్యక్రమాలకు పాకిస్థాన్ అభ్యంతరం.. సున్నితంగా తిరస్కరించిన మలేషియా మలేషియా
    Ukraine-Russia: ఏప్రిల్ 2026 నాటికి ఉక్రెయిన్‌కు 100,000 డ్రోన్‌లు: బ్రిటన్  బ్రిటన్

    నందమూరి బాలకృష్ణ

    రేపు హైదరాబాద్‌లో టీడీపీ భారీ ర్యాలీ, చంద్రబాబు, బాలకృష్ణ హాజరు చంద్రబాబు నాయుడు
    లోకేశ్ పాదయాత్రలో కుప్పకూలిన నందమూరి తారకరత్న, ఆస్పత్రికి తరలింపు తెలుగు దేశం పార్టీ/టీడీపీ
    నందమూరి కుటుంబంలో మరో విషాదం- హీరో బాలకృష్ణ సోదరుడికి యాక్సిడెంట్ హైదరాబాద్
    సినీనటుడు తారకరత్న కన్నుమూత- విషాదంలో నందమూరి కుటుంబం సినిమా

    బోయపాటి శ్రీను

    బోయపాటి-రామ్ పాన్ ఇండియా సినిమా మూవీ టైటిల్‌ గ్లింప్స్‌ విడుదల  టాలీవుడ్
    Balayya - Boyapati : బాలయ్య - బోయపాటి కాంబో.. దసరా సందర్భంగా కొత్త అప్డేట్.. షూటింగ్ ఎప్పుడంటే?  నందమూరి బాలకృష్ణ
    Balayya-Boyapati: బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్‌లో కొత్త సినిమా.. రేపు టీజర్, టైటిల్ అనౌన్స్‌మెంట్! నందమూరి బాలకృష్ణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025