
Akhanda 2.0: 'అఖండ 2' వాయిదా.. అధికారికంగా ప్రకటించిన నిర్మాణ సంస్థ
ఈ వార్తాకథనం ఏంటి
పలు కారణాల వల్ల ఇప్పటికే అనేక సినిమాల విడుదల తేదీల్లో మార్పులు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈజాబితాలో ప్రముఖ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ నటించిన 'అఖండ 2' సినిమా కూడా చేరింది. ముందుగా ప్రకటించిన తేదీకి సినిమాని విడుదల చేసే పరిస్థితి లేదని, నిర్మాణ సంస్థ'14 రీల్స్ ప్లస్' పేర్కొంది. భారీస్థాయిలో రూపొందిస్తున్న ఈ చిత్రానికి రీ-రికార్డింగ్,వీఎఫ్‌ఎక్స్ సహా అన్ని పోస్ట్-ప్రొడక్షన్ పనులు పూర్తవడానికి ఎక్కువ సమయం పడుతుందని,అందుకే విడుదలను వాయిదా వేస్తున్నట్లు వారు తెలిపారు. నిర్మాణ సంస్థ తెలిపిన ప్రకారం,త్వరలోనే కొత్త విడుదల తేదీపై వివరాలు అందిస్తామని తెలిపారు. ఈసినిమా దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతోంది.ఇప్పటికే ఘన విజయం సాధించిన 'అఖండ' మూవీకి సీక్వెల్‌గా ఇది తెరకెక్కుతోంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
14 రీల్స్ ప్లస్ చేసిన ట్వీట్
#Akhanda2 - AN IMPORTANT ANNOUNCEMENT.#Akhanda2Thaandavam
— 14 Reels Plus (@14ReelsPlus) August 28, 2025
'GOD OF MASSES' #NandamuriBalakrishna #BoyapatiSreenu @AadhiOfficial @MusicThaman @14ReelsPlus @iamsamyuktha_ @RaamAchanta #GopiAchanta #MTejeswiniNandamuri @kotiparuchuri @ivyofficial2023 pic.twitter.com/3cKUSuehyS