Akhanda-2: ఇవాళే 'అఖండ-2' ప్రీ-రిలీజ్ ఈవెంట్.. కూకట్‌పల్లి పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు!
ఈ వార్తాకథనం ఏంటి
నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'అఖండ-2' ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను దృష్టిలో పెట్టుకుని శుక్రవారం కూకట్‌పల్లి పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని సైబరాబాద్ పోలీసులు ప్రకటించారు. నవంబర్ 28న కైతలాపూర్ గ్రౌండ్‌లో భారీ స్థాయిలో కార్యక్రమం జరగనున్న నేపథ్యంలో, వాహనదారులకు ముందస్తు సూచనలు జారీ చేశారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఈవెంట్ ప్రాంతంలో విపరీతమైన జనసమ్మర్దం, భారీ ట్రాఫిక్ అంతరాయం ఉండే అవకాశం ఉందని ట్రాఫిక్ అధికారులు అంచనా వేశారు. ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు పలు కీలక రూట్లలో ట్రాఫిక్‌ను తాత్కాలికంగా మళ్లించే చర్యలు చేపట్టారు.
Details
ట్రాఫిక్ మళ్లింపుల వివరాలు
మూసాపేట్ వైపు నుంచి భరత్‌నగర్, ఎర్రగడ్డ మీదుగా వచ్చే వాహనాలు → కూకట్‌పల్లి Y జంక్షన్ వైపు మళ్లింపు కూకట్‌పల్లి Y జంక్షన్ నుంచి ఐడిఎల్ లేక్ వైపు వెళ్లే ట్రాఫిక్ → అశోకా వన్ మాల్ వద్ద జేఎన్టీయూ రోడ్డులోకి మళ్లింపు మాదాపూర్-హైటెక్ సిటీ నుంచి కైతలాపూర్ వైపు వచ్చే వాహనాలు → యశోద హాస్పిటల్ వద్ద నెక్సస్ మాల్-జేఎన్టీయూ వైపు మళ్లింపు పోలీసులు ప్రయాణికులు తమ ప్రయాణాలను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని, సాధ్యమైనంత వరకు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని సూచించారు. ఈవెంట్ నిర్వహణలో ఉన్న ట్రాఫిక్ సిబ్బందికి సహకరించాలని కూడా కోరారు. 'అఖండ-2' చిత్రం డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.