Akhanda 2: 'అఖండ 2' విడుదల వాయిదా.. కొత్త రిలీజ్ డేట్‌పై అప్‌డేట్ ఇచ్చిన నిర్మాణ సంస్థ
ఈ వార్తాకథనం ఏంటి
'అఖండ 2' (Akhanda 2) విడుదలపై చివరికి నిర్మాణ సంస్థ అధికారిక స్పష్టం ఇచ్చింది. కొత్త రిలీజ్ డేట్ (Akhanda 2 New Release Date)ను త్వరలోనే ప్రకటిస్తామని 14 రీల్స్ ప్లస్ సోషల్ మీడియాలో వెల్లడించింది. అఖండ 2 విడుదల కోసం మా వంతు ప్రయత్నం అంతా చేశాం. కానీ అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ విడుదల సాధ్యపడలేదు. కొన్ని సందర్భాల్లో అనుకోని పరిస్థితులు ఎదురవుతాయి. ఈ చిత్రాన్ని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులకు, సినీ ప్రేమికులకు క్షమాపణలు తెలియజేసుకుంటున్నాం. ఈ క్లిష్ట సందర్భంలో మా వెంట నిలిచిన నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుకు ప్రత్యేక ధన్యవాదాలని పోస్టు చేసింది.
Details
త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటన
అసలు డిసెంబరు 5న విడుదల చేయాలని ముందుగా నిర్ణయించిన ఈ సినిమా చివరి నిమిషంలో ఆర్థిక సంబంధిత ఇబ్బందులు తలెత్తడంతో వాయిదా పడింది. దీనితో పాటు సోషల్ మీడియాలో అనేక రకాల రూమర్స్ కూడా చక్కర్లు కొట్టాయి. ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్లు రాస్తున్నారని, ఈ పరిస్థితులు నిర్మాతలను ఇబ్బంది పెడుతున్నాయని ప్రముఖ నిర్మాత సురేశ్ బాబు తాజా ప్రెస్‌మీట్‌లో అసహనం వ్యక్తం చేశారు. ఈ సినిమా సమస్యలను పరిష్కరించేందుకు వెళ్లిన వారిలో తాను కూడా ఉన్నానని ఆయన తెలిపారు.