LOADING...
Akhanda 2 Review: అఖండ 2 రివ్యూ.. హై వోల్టేజ్ యాక్షన్‌లో బాలయ్య మాస్ ఎలిమెంట్స్ తాండవమేనా? 
అఖండ 2 రివ్యూ.. హై వోల్టేజ్ యాక్షన్‌లో బాలయ్య మాస్ ఎలిమెంట్స్ తాండవమేనా?

Akhanda 2 Review: అఖండ 2 రివ్యూ.. హై వోల్టేజ్ యాక్షన్‌లో బాలయ్య మాస్ ఎలిమెంట్స్ తాండవమేనా? 

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 12, 2025
09:17 am

ఈ వార్తాకథనం ఏంటి

బాలకృష్ణ (Balakrishna) హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన 'అఖండ' ఘన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. అఘోర వేషంలో బాలయ్య నటన, తమన్ సంగీతం, బోయపాటి స్టైల్ టేకింగ్‌ ఆ చిత్రాన్ని బ్లాక్‌బస్టర్‌గా నిలిపాయి. అదే ఉత్సాహాన్ని కొనసాగిస్తూ, ఇప్పుడు 'అఖండ 2: తాండవం' రూపంలో సీక్వెల్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మరి ఈసారి అఘోరా యుద్ధం ఎవరిమీద? కథ ఏ దిశగా నడిచింది?

Details

కథ ఏమిటి?

Akhanda 2 Story సినిమా టిబెట్‌ సరిహద్దుల్లో ప్రారంభమవుతుంది. చైనాతో ఉన్న శత్రుత్వం నేపథ్యంలో, అక్కడి ఆర్మీ అధికారులు భారతీయుల నమ్మకాలపై దెబ్బకొట్టే కుట్రలో భాగంగా కుంభమేళాను టార్గెట్ చేస్తారు. బయోవార్ రూపంలో చేసిన ఈ దాడితో పవిత్రస్నానం చేసిన వేలాది మంది అకస్మాత్తుగా అపస్మారక స్థితిలోకి పడతారు. దీనికి ప్రతివిషంగా డీఆర్‌డీవో శాస్త్రవేత్తలు యాంటీడోట్‌ను సంధిస్తారు. ఇది తెలిసిన శత్రువులు ల్యాబ్‌పై దాడి చేసి అందరినీ హతమారుస్తారు. ఆ బృందంలో ఉన్న యువ శాస్త్రవేత్త జనని (హర్షాలీ మల్హోత్రా) ఒక్కరే వాక్సిన్‌తో బయటపడుతుంది.

 Details

 ద్విపాత్రాభినయంలో బాలకృష్ణ

ఆమెను చైనా ఏజెంట్లు తరుముతుండగా... ఆమె రక్షణ కోసం రుద్ర సికిందర్ అఘోరా (బాలకృష్ణ) రంగంలోకి దిగుతాడు. జనని-బాలమురళీ కృష్ణ (బాలకృష్ణ ద్విపాత్రాభినయం) మధ్య ఉన్న సంబంధం ఏంటి? అఘోరా ఈ బాహ్యశత్రువుల కుట్రను ఎలా ఛేదించాడు? భారత వేద జ్ఞానం, సనాతన ధర్మ శక్తిని ఎలా లోకానికి చాటి చెప్పాడు? అన్నది తెరపైనే తెలుసుకోవాలి.

Advertisement

Details

 సినిమా ఎలా ఉందంటే?

Akhanda 2 Thaandavam Review ఈసారి కథను సరిహద్దులకు తీసుకెళ్లిన దర్శకుడు బోయపాటి శ్రీను, అఘోరా పవర్‌కు మరింత ఎత్తు ఇచ్చారు. సనాతన ధర్మం, భారతీయ సంప్రదాయాలు, వేద శక్తిపై దృష్టి పెట్టి అఘోరా పాత్రను ఒక సర్జికల్ స్ట్రైక్‌ రూపంలో చూపించారు. మాస్ ఎలివేషన్లలో బోయపాటి శైలి ఏంటో తెలిసిన విషయమే. అందులో బాలయ్య చేరితే ఆ మోత రెట్టింపు. అఖండ రీక్యాప్‌తో ప్రారంభమయ్యే చిత్రం... టిబెట్ ఘర్షణలు, చైనా కుట్రల నేపథ్యం, అంతర్జాతీయ స్థాయి బయోటెర్రర్ ప్లాట్లతో ముందుకు సాగుతుంది. దాదాపు 'అఖండ' టెంప్లేట్‌లోనే కొన్ని భాగాలు కనిపించినా, సీక్వెల్‌ స్కేలు మరింత పెద్దది. అనంతపురం ఎమ్మెల్యే బాలమురళీ కృష్ణ ట్రాక్‌లో మాస్ ఎలివేషన్లు పుష్కలంగా ఉంటాయి.

Advertisement

Details

డైలాగ్స్ కు పూనకాలే

ఈసారి ఆయన మత్తు పదార్థాల ముఠాపై యుద్ధం చేస్తాడు. ఈ ఎపిసోడ్ కొంత లాగుతున్నట్టు అనిపించినా... ఇంటర్వెల్ సీన్ మాత్రం భారీ హైపుగా నిలుస్తుంది. విరామం తర్వాత కథ దూసుకుపోతుంది. అఘోరా ఎంట్రీ నుంచి బాలయ్య అసలైన 'తాండవం' మొదలవుతుంది. నేత్ర (ఆది పినిశెట్టి) పాత్రతో వచ్చే తాంత్రిక ఎపిసోడ్, హనుమాన్-శివుడు నేపథ్యంలో వచ్చే ఘట్టాలు, తల్లి-కొడుకు భావోద్వేగాలు, దేశభక్తి సన్నివేశాలు, ముఖ్యంగా తల్లి బ్యాక్‌స్టోరీ సినిమాకు బలమైన ఆధారమని చెప్పొచ్చు. సర్జికల్ స్ట్రైక్ యాక్షన్ సెట్‌పీసులు, వేదభూమి భారత్ మహోన్నతతను చాటి చెప్పే డైలాగులు—అన్నీ ఫ్యాన్స్‌కు పూనకాలే. రాజకీయ కోణాలు, చైనా నేపథ్యంలోని సంభాషణలు కూడా కొంత స్పష్టంగా కనిపిస్తాయి.

Details

బలాలు

బాలకృష్ణ పవర్‌ఫుల్ నటన ఇంటర్వెల్ సీక్వెన్స్ భావోద్వేగాలు, తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బలహీనతలు తొలి భాగంలో సాగదీత సన్నివేశాలు చివరి మాట: 'అఖండ 2' - బాలయ్య తాండవం థియేటర్లలో దద్దరిల్లింది!

Advertisement