NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Nagarjuna: అఖిల్‌ వివాహం ఎప్పుడో చెప్పేసిన నాగార్జున 
    తదుపరి వార్తా కథనం
    Nagarjuna: అఖిల్‌ వివాహం ఎప్పుడో చెప్పేసిన నాగార్జున 
    అఖిల్‌ వివాహం ఎప్పుడో చెప్పేసిన నాగార్జున

    Nagarjuna: అఖిల్‌ వివాహం ఎప్పుడో చెప్పేసిన నాగార్జున 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 28, 2024
    10:43 am

    ఈ వార్తాకథనం ఏంటి

    అక్కినేని కుటుంబంలో వరుస వివాహ వేడుకలు జరగనుండటం తెలిసిందే.

    నాగార్జున పెద్ద తనయుడు నాగ చైతన్య వివాహం కొన్ని రోజుల్లో జరగబోతుండగా, చిన్నతనయుడు అఖిల్ కూడా పెళ్లి కొడుకు గా సిద్ధమయ్యారు.

    ఈ నేపథ్యంలో నాగార్జున తన కుటుంబంలో జరుగుతున్న శుభకార్యాలపై ఆనందం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఇటీవల ఆయన ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు.

    వివరాలు 

    డిసెంబర్ 4న నాగచైతన్య-శోభిత వివాహం

    "ఈ ఏడాది మా కుటుంబానికి చాలా ప్రత్యేకమైనది. ఒకవైపు నాన్నగారి శతజయంతి వేడుకలు జరుగుతున్నాయి,మరొకవైపు నా పిల్లలు జీవితంలో కొత్త మార్గాన్ని చేపట్టబోతున్నారు.డిసెంబర్ 4న నాగచైతన్య-శోభిత వివాహం జరగనుంది.పెళ్లి ఏర్పాట్లు త్వరగా జరుగుతున్నాయి. నా తండ్రి స్థాపించిన అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఈ పెళ్లి జరగడం చాలా ఆనందం కలిగిస్తోంది.మా కుటుంబం చాలా పెద్దది,అలాగే శోభిత కుటుంబం కూడా చాలా పెద్దది.ఈ పెళ్లి సంతోషంగా, కొంత మంది సమక్షంలో గ్రాండ్‌గా జరగాలని అనుకుంటున్నాం.

    వివరాలు 

    వచ్చే ఏడాదిలో వీరి పెళ్లి

    మా రెండో కుమారుడు అఖిల్ కూడా త్వరలో పెళ్లి బంధంలోకి అడుగుపెడుతున్నందుకు ఆనందంగా ఉంది. జైనబ్ రవ్జీ చాలా మంచి అమ్మాయి. ఆమెకు ఇతరులపై ప్రేమ, అనురాగం గలిగిఉంది. వారిద్దరూ కలిసి జీవితం కొనసాగించాలని నిర్ణయించుకున్నందుకు సంతోషంగా ఉంది. అఖిల్ ఆమెతో జీవితం పరిపూర్ణం చేసుకోవాలని నేను నమ్ముతున్నాను. ఆమెను మా కుటుంబంలో స్వాగతిస్తున్నాను. వచ్చే ఏడాదిలో వీరి పెళ్లి జరగనుంది'' అని నాగార్జున చెప్పారు.

    మంగళవారం అఖిల్-జైనబ్ నిశ్చితార్థం జరిగినట్లు నాగార్జున ప్రకటించారు.

    ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో ఈ వేడుక నాగార్జున నివాసంలో జరిగింది.

    వివరాలు 

    అఖిల్‌కి రెండు సంవత్సరాల క్రితం పరిచయమైన జైనబ్

    "జైనబ్‌తో అఖిల్ నిశ్చితార్థం జరగడం చాలా ఆనందంగా ఉంది. మా కోడలిగా జైనబ్‌ను మా కుటుంబంలో స్వాగతించడానికి సంతోషిస్తున్నాం. కాబోయే దంపతులకు మీ ఆశీస్సులు కావాలి'' అంటూ ఆయన ఒక పోస్ట్‌లో తెలిపారు.

    జైనబ్ రవ్జీ చిత్రకారిణిగా,సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా పేరుగాంచింది.

    ఆమె భారతదేశం, దుబాయ్,లండన్‌లో ప్రదర్శనలు పెట్టినట్లు తెలిసింది.

    ఆమె హైదరాబాద్‌లో జన్మించి ముంబయిలో నివసిస్తుందని సమాచారం.

    ఆమె తండ్రి జుల్ఫీ రవ్జీ, నాగార్జునతో చాలా సంవత్సరాలుగా స్నేహంగా ఉన్నారు.

    అఖిల్‌తో జైనబ్ పరిచయమైన రెండు సంవత్సరాల క్రితం, అది ప్రేమగా మారిందని చెబుతున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నాగార్జున

    తాజా

    Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు కోవిడ్
    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ
    Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు.. బాయ్‌కాట్‌ టర్కీ
    India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు.. కేంద్ర ప్రభుత్వం

    నాగార్జున

    బిగ్ బాస్ సీజన్ 7 ప్రోమో వచ్చేసింది: స్టైలిష్ లుక్ లో అదరగొడుతున్న నాగార్జున  టెలివిజన్
    టాలీవుడ్ లో రీ రిలీజుల పర్వం: అక్కినేని నాగార్జున మన్మథుడు సినిమా మళ్ళీ విడుదల  తెలుగు సినిమా
    బిగ్‍బాస్- 7కు ముహుర్తం ఖరారు.. ఇప్పటికే భారీ అంచ‌నాలు పెంచిన టీజ‌ర్‌ బిగ్ బాస్ 7
    Happy birthday Nagarjuna: అమ్మాయిలకు మన్మధుఢు, అభిమానులకు కింగ్ నాగార్జున పుట్టినరోజు ప్రత్యేక కథనం  తెలుగు సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025