LOADING...
Lenin: రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో అఖిల్ 'లెనిన్'.. లేటెస్ట్ అప్‌డేట్ ఇదే!
రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో అఖిల్ 'లెనిన్'.. లేటెస్ట్ అప్‌డేట్ ఇదే!

Lenin: రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో అఖిల్ 'లెనిన్'.. లేటెస్ట్ అప్‌డేట్ ఇదే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 26, 2026
12:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

యంగ్ హీరో అక్కినేని అఖిల్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'లెనిన్' షూటింగ్ కీలక దశకు చేరుకుంది. దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరి (నందు) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సంబంధించి, ఈ వారం నుంచే క్లైమాక్స్‌లోని ప్యాచ్ వర్క్‌ను చిత్రీకరించేందుకు యూనిట్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ షూట్‌లో అఖిల్‌తో పాటు ఇతర ప్రధాన తారాగణం కూడా పాల్గొననుంది. ఇక షూటింగ్ చివరి దశలో ఉండటంతో మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా టీమ్ శరవేగంగా పూర్తి చేస్తోంది. రాయలసీమ బ్యాక్‌డ్రాప్, ముఖ్యంగా చిత్తూరు ప్రాంతం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుండటం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

Details

హీరోయిన్ గా భాగ్యశ్రీ బోర్సే 

ఈ చిత్రంలో అందాల భామ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. అఖిల్ - భాగ్యశ్రీ జోడీపై ఇప్పటికే మంచి బజ్ నెలకొంది. ముఖ్యంగా వీరిద్దరి మధ్య వచ్చే లవ్ సీన్స్ చాలా బాగా వచ్చాయని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. 'లెనిన్' సినిమాపై అఖిల్ భారీ ఆశలు పెట్టుకున్నాడు. ఇప్పటివరకు చూసిన అవుట్‌పుట్ పట్ల టీమ్ కూడా పూర్తి నమ్మకంతో ఉంది. మరి ఈ సినిమాతో అఖిల్ తన కెరీర్‌కు కావాల్సిన బలమైన హిట్ అందుకుంటాడో లేదో వేచి చూడాలి.

Advertisement