Page Loader
Akkineni Akhil: అక్కినేని ఫ్యామిలీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. అఖిల్ మ్యారేజ్ డేట్ ఫిక్స్!
అక్కినేని ఫ్యామిలీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్

Akkineni Akhil: అక్కినేని ఫ్యామిలీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. అఖిల్ మ్యారేజ్ డేట్ ఫిక్స్!

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 20, 2025
01:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

తాజాగా అక్కినేని కుటుంబంలో పెళ్లి బాజాలు మోగిన విషయం తెలిసిందే. నాగ చైతన్య, శోభితల వివాహం ఇటీవలే ఘనంగా జరిగింది. ఇప్పుడు మరోసారి అక్కినేని ఇంట పెళ్లి సందడి ప్రారంభమైంది. నాగచైతన్య పెళ్లి సందర్భంగా అఖిల్ తన ప్రేయసి జైనాబ్‌తో నిశ్చితార్థం చేసుకున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలను నాగార్జున సోషల్ మీడియాలో షేర్ చేస్తూ శుభవార్త ప్రకటించారు. తాజాగా అఖిల్, జైనాబ్‌ల పెళ్లి తేదీ ఖరారైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మార్చి 24న ఈ పెళ్లి జరగనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. నాగచైతన్య పెళ్లి సింపుల్‌గా కొద్దిమంది బంధువులు, సన్నిహితుల మధ్య జరుగగా, అఖిల్ పెళ్లి మాత్రం వైభవంగా నిర్వహించేందుకు నాగార్జున ప్రణాళిక చేస్తున్నట్లు సమాచారం.

వివరాలు 

శోభిత కోడలుగా వచ్చినప్పటి నుంచి నాగార్జున ఇంట్లో వరుస శుభవార్తలు

ఈ వేడుకకు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, క్రికెటర్లను ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. అయితే, దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రానప్పటికీ ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు వస్తోంది. గతంలో అఖిల్ ఒక అమ్మాయితో నిశ్చితార్థం చేసుకుని, ఆ తర్వాత రద్దు చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఆ విభజనకు కారణం తెలియకపోయినా, వారి మధ్య బ్రేక్‌అప్ జరిగింది. ఆ సమయంలో అక్కినేని కుటుంబానికి పెళ్లిళ్లు సజావుగా జరగడం లేదనే విమర్శలు వచ్చాయి. కానీ శోభిత కోడలుగా వచ్చినప్పటి నుంచి నాగార్జున ఇంట్లో వరుస శుభవార్తలు వినిపిస్తున్నాయి.