Page Loader
Akhil Akkineni: వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన అక్కినేని అఖిల్.. వైరల్ అవుతున్న ఫోటోలు 
వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన అక్కినేని అఖిల్.. వైరల్ అవుతున్న ఫోటోలు

Akhil Akkineni: వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన అక్కినేని అఖిల్.. వైరల్ అవుతున్న ఫోటోలు 

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 06, 2025
09:18 am

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా పేరొందిన అక్కినేని అఖిల్ వివాహబంధంలోకి అడుగుపెట్టాడు. ఇప్పటివరకు బ్యాచిలర్‌గా ఉన్న అఖిల్, తన ప్రేయసి జైనబ్‌తో ఏడడుగులు వేసి జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాడు. ఈ వివాహ వేడుక శుక్రవారం (జూన్ 6) తెల్లవారు జామున 3 గంటలకు జూబ్లీహిల్స్‌లోని నాగార్జున నివాసంలో ఘనంగా జరిగింది.

వివరాలు 

అఖిల్, జైనబ్ దంపతులకు శుభాకాంక్షలు

సంప్రదాయబద్ధంగా జరిగిన ఈ పెళ్లికి అఖిల్, జైనబ్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. సినీ పరిశ్రమ నుంచి మెగాస్టార్ చిరంజీవి- సురేఖ దంపతులు, రామ్ చరణ్- ఉపాసన, దర్శకుడు ప్రశాంత్ నీల్, హీరో సుమంత్ తదితరులు పెళ్లికి వచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించారు. జూన్ 8న అన్నపూర్ణ స్టూడియోలో గ్రాండ్ రిసెప్షన్‌ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అఖిల్, జైనబ్ దంపతులకు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, అభిమానులు నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన అక్కినేని అఖిల్