Page Loader
Akhil Akkineni: అక్కినేని అఖిల్ పెళ్లి.. కాబోయే భార్య గురించి తెలిస్తే షాక్ అవాల్సిందే!
అక్కినేని అఖిల్ పెళ్లి.. కాబోయే భార్య గురించి తెలిస్తే షాక్ అవాల్సిందే!

Akhil Akkineni: అక్కినేని అఖిల్ పెళ్లి.. కాబోయే భార్య గురించి తెలిస్తే షాక్ అవాల్సిందే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 27, 2024
11:40 am

ఈ వార్తాకథనం ఏంటి

అక్కినేని కుటుంబంలో పెళ్లి సందడి ప్రారంభమైంది. అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల వివాహం డిసెంబరు 4న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరగనుంది. అక్కినేని అఖిల్ అక్కినేని నిశ్చితార్థం కూడా అద్భుతంగా జరిగిందని నాగార్జున ఈ విషయాన్ని మంగళవారం వెల్లడించారు. అఖిల్ నిశ్చితార్థం చేసిన వ్యక్తి జైనబ్‌ రవ్జీ గురించి ఆసక్తకర విషయాలు తెలిశాయి. నిశ్చితార్థం జరిగిన తర్వాత ఆమె గురించి తెలుసుకోవాలని నెటిజన్లు వెతుకున్నారు. జైనబ్‌ రవ్జీ ఒక ప్రతిభావంతురాలైన చిత్రకారిణి. హైదరాబాద్‌లో పుట్టిన జైనబ్, దుబాయ్, లండన్, ముంబయి వంటి ప్రదేశాల్లో పెరిగారు. సినిమాలో కూడా తన ప్రతిభను చూపించిన జైనబ్, ఎంఎఫ్ హుస్సేన్ దర్శకత్వంలో 'మీనాక్షి: ఎ టేల్ ఆఫ్ థ్రీ సిటీస్' సినిమాలో నటించారు.

Details

సినిమాల్లో నటించిన జైనబ్ రవ్జీ

ఈ సినిమాలో టబు, కునాల్ కపూర్ కీలక పాత్రల్లో నటించారు. తన పెయింటింగ్ ప్రొఫెషన్‌తో పాటు, జైనబ్‌ రవ్జీ చాలా లో-ప్రొఫైల్‌గా జీవిస్తుంటారు. జైనబ్‌ రవ్జీ కుటుంబం పలు వ్యాపారాల్లో ప్రాచుర్యం పొందింది. ఆమె తండ్రి జుల్ఫీ రవ్జీ ఒక ప్రముఖ కన్‌స్ట్రక్షన్ రంగ వ్యాపారవేత్త, ఆమె సోదరుడు జైన్ రవ్జీ జేఆర్ రెన్యూబల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు ఛైర్మన్, ఎండీగా పనిచేస్తున్నారు. అయితే అనేక సంవత్సరాలుగా అక్కినేని నాగార్జున, జుల్ఫీ రవ్జీ మిత్రులుగా ఉంటున్నారు. ఇప్పటికే అఖిల్ అక్కినేని, జైనబ్‌ రవ్జీ రెండు సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నారు. ఉపాసన కొణెదల, రానా దగ్గుబాటి వంటి ప్రముఖులు కూడా జైనబ్‌ను సోషల్ మీడియాలో ఫాలో చేస్తున్నారు.