IFFI 2024: గోవాలో ప్రారంభమైన ఇఫ్ఫీ.. అక్కినేని స్మారక తపాలాబిళ్ల విడుదల
ఈ వార్తాకథనం ఏంటి
గోవా రాజధాని పనాజీలోని డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ స్టేడియంలో బుధవారం 55వ భారతీయ అంతర్జాతీయ సినిమా పండుగ (ఇఫ్ఫీ) ఘనంగా ప్రారంభమైంది.
ఈ కార్యక్రమానికి కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, సహాయమంత్రి డాక్టర్ ఎల్.మురుగన్ వీడియో సందేశాల ద్వారా తన అభినందనలు తెలిపారు.
భారత చలనచిత్ర రంగ ప్రముఖులైన , అక్కినేని నాగేశ్వరరావు, రాజ్‌కపూర్, మహమ్మద్ రఫీ, తపన్‌సింహాల శత జయంతుల సందర్భంగా ఈ వేదికపై వారి పట్ల గౌరవం తెలుపుతూ నివాళులర్పించారు.
వారి పేర్లతో స్మారక తపాలా బిళ్లలను విడుదల చేశారు.
వివరాలు
ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ రవిశంకర్ ప్రసంగం
ఈ వేడుకలో తెలుగు సినీ నటుడు నాగార్జున, బాలీవుడ్ దర్శకుడు శేఖర్‌కపూర్ తదితరులు ప్రముఖులు పాల్గొన్నారు.
ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ రవిశంకర్ ఈ కార్యక్రమంలో తన ప్రసంగంలో సినిమాలు ప్రజల జీవితాన్ని ఆశలతో నింపాలి, వారిని సంతోషంగా జీవించేలా ప్రేరేపించాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.