
Naga Chaitanya Dhootha : నాగచైతన్య దూత ఫస్ట్ లుక్ చూశారా.. సీరియస్ యాక్షన్
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య తొలి వెబ్ సిరీస్ 'దూత'కు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదలైంది. ఈ మేరకు సీరియస్ యాక్షన్ మోడ్ లో చైతన్య కనిపించారు.
హార్రర్ సినిమాలు,భయేపెట్టే మూవీలు అంటే చైతూకు భయం. దెయ్యాలు, ఆత్మలు, భూతాలు నేపథ్యంలో సాగే సినిమాలు ఆయన చూడరనేది టాక్.
ఇదే సమయంలో అలాంటి చిత్రాలకు తాను దూరమని గతంలో ఆయనే చెప్పారు. అలాంటిది తాజాగా ఆయనే ఓ హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లో కీలక పాత్ర పోషిస్తున్నారు.
అక్కినేని నాగ చైతన్య హీరోగా వెబ్ సిరీస్ 'దూత' విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంది. ఈ మేరకు బుధవారం వెబ్ సిరీస్ లో భాగంగా నాగచైతన్య ఫస్ట్ లుక్ విడుదల చేశారు.
DETAILS
ఒక్కో సీజన్ లో 8 లేదా 10 ఎపిసోడ్స్
డిసెంబర్ 1 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో 'దూత' ప్రసారం కానుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటిటి కోసం 'దూత' వెబ్ సిరీస్ చేశారు.
ఈ మేరకు ఇవాళ ఫస్ట్ లుక్ విడుదల అయ్యింది. మొత్తం మూడు సీజన్స్ విడుదల చేయాలని ప్రణాళికలు రచించారని టాక్.
ఒక్కో సీజన్ లో 8 లేదా 10 ఎపిసోడ్స్ ఉండనున్నాయి. '13 బి' సినిమాతో హార్రర్ నేపథ్యంలో విక్రమ్ కె కుమార్ ఉత్కంఠగా సాగే మూవీ తీశారు. ఫలితంగా తాజా వెబ్ సిరీస్ మీద భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.
ఇందులో నాగ చైతన్య జర్నలిస్టు పాత్రలో నటించినట్లు తెలుస్తోంది. ఆయనకు జోడిగా తమిళ కథానాయిక ప్రియా భవానీ శంకర్ కీలక పాత్ర పోషించారు.