Akshaye Khanna: ఔరంగజేబు అవతారంలో అక్షయ్ ఖన్నా.. 'చావా' ఫస్ట్ లుక్ రిలీజ్
ఈ వార్తాకథనం ఏంటి
బాలీవుడ్‌లో భారీ అంచనాల మధ్య రాబోతున్న ప్రాజెక్ట్ 'ఛావా'. ఈ చిత్రంలో విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు, ఆయన శంభాజీ మహరాజ్ పాత్ర పోషిస్తున్నారు.
లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం, మహారాష్ట్ర యోధుడు ఛత్రపతి శివాజీ మహరాజ్ కుమారుడు శంభాజీ మహరాజ్ జీవిత ఆధారంగా రూపొందుతోంది.
రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సినిమా నుండి ఇప్పటికే శంభాజీ మహరాజ్ పాత్రలో విక్కీ కౌశల్, ఆయన భార్య ఏసు బాయి పాత్రలో రష్మిక మందన్నా నటిస్తోంది.
Details
చావా ట్రైలర్ రేపు రిలీజ్
తాజాగా బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో అక్షయ్ ఖన్నా, ఔరంగజేబు పాత్రలో నటిస్తున్నారు.
మొఘల్ సామ్రాజ్యాన్ని క్రూరంగా పాలించిన ఔరంగజేబు పాత్రలో అక్షయ్ కనిపిస్తున్నట్లు పోస్టర్‌లో పేర్కొన్నారు. ఇక ఈ సినిమా ట్రైలర్ రేపు విడుదల కానుంది.
మడాక్ ఫిల్మ్స్ పతాకంపై దినేశ్ విజన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు, కాగా ఏ.ఆర్. రెహ్మాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్
Darr aur dehshat ka naya chehra - Presenting #AkshayeKhanna as Mughal Shahenshah Aurangzeb, the ruthless ruler of the Mughal Empire!#ChhaavaTrailer out tomorrow.
— Maddockfilms (@MaddockFilms) January 21, 2025
Releasing in cinemas on 14th February 2025. #Chhaava #ChhaavaOnFeb14 pic.twitter.com/g14Fbiavse