ఓ మై గాడ్ 2 టీజర్: గోపాల గోపాల సినిమాకు హిందీలో సీక్వెల్ రెడీ
అక్షయ్ కుమార్ శ్రీకృష్ణుడిగా కనిపించిన బాలీవుడ్ మూవీ ఓ మై గాడ్ ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలుసు. 2012లో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీసును షేక్ చేసింది. ఓ మై గాడ్ చిత్రాన్ని తెలుగులో పవన్ కళ్యాణ్, వెంకటేష్ హీరోలుగా గోపాల గోపాల పేరుతో రీమేక్ చేసారు. తెలుగులో ఈ చిత్రం ఫర్వాలేదనిపించుకుంది. అదలా ఉంచితే, ప్రస్తుతం ఓ మై గాడ్ సినిమాకు సీక్వెల్ రాబోతుంది. తాజాగా ఓ మై గాడ్ 2 టీజర్ రిలీజ్ అయ్యింది. మొదటి భాగంలో ప్రధాన లో పాత్రలో పరేష్ రావల్ కనిపిస్తే, సెకండ్ పార్ట్ లో పంకజ్ త్రిపాఠి కనిపిస్తున్నారు.
శివుడి చుట్టూ తిరిగే కథ
మొదటి భాగంలో పరేష్ రావేల్ దేవుళ్ళను నమ్మడు. కానీ రెండవ భాగంలో పంకజ్ త్రిపాఠి పాత్ర దేవుళ్ళను నమ్ముతున్నట్టుగా చూపించారు. మొదటి భాగంలో అక్షయ్ కుమార్ కృష్ణుడిగా కనిపించారు. రెండవ భాగంలో మహాకాలేశ్వరుడిగా కనిపిస్తున్నారు. సినిమా మొత్తం శివుడి చుట్టూ తిరుగుతుందని టీజర్ లో కనిపించింది. బ్యాగ్రౌండ్ లో వినిపించిన హర హర అనే థీమ్ సాంగ్ అద్భుతంగా ఉంది. వయాకామ్ 18స్టూడియోస్, కేప్ ఆఫ్ గుడ్ ఫిలిమ్స్, వకావో ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను అమిత్ రాయ్ డైరెక్ట్ చేస్తున్నారు. యామి గౌతమ్ హీరోయిన్ గా కనిపించనున్న ఓ మై గాడ్ 2 సినిమాను ఆగస్టు 11న రిలీజ్ చేస్తున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.