LOADING...
Alia Bhatt: తన కూతురు 'రాహా' కోసం జానర్ మార్చిన అలియా భట్‌..!
తన కూతురు 'రాహా' కోసం జానర్ మార్చిన అలియా భట్‌..!

Alia Bhatt: తన కూతురు 'రాహా' కోసం జానర్ మార్చిన అలియా భట్‌..!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 05, 2025
12:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

బాలీవుడ్‌లో బలమైన ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చినప్పటికీ, తన సొంత ప్రతిభతోనే స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది అలియా భట్. వరుస ప్రాజెక్టులు చేస్తూ, మరోవైపు కుటుంబానికి కూడా సమాన ప్రాధాన్యత ఇస్తూ బిజీ షెడ్యూల్‌ను చక్కగా మేనేజ్‌ చేస్తున్నారు. ముఖ్యంగా తన కుమార్తె రాహా గురించి సోషల్ మీడియాలో తరచుగా పంచుకునే అలియా, ఇప్పుడు కెరీర్‌లో ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 'ఇప్పటి వరకు నేను రాహా చూసి ఆనందించే సినిమాలు చేయలేదు. ఇకపై ఆమె చూసి ఎంజాయ్‌ అయ్యేలా సినిమాటిక్‌ ప్రపంచాన్ని సృష్టించాలని నిర్ణయించుకున్నాను. ముఖ్యంగా కామెడీ కథలకు ప్రాధాన్యత ఇవ్వబోతున్నాను. హాస్య సినిమాలు చేయడానికి నా కుమార్తె రాహానే ప్రధాన కారణం.

Details

సంతోషం వ్యక్తం చేస్తున్న అలియా అభిమానులు

ఇప్పటికే కొన్ని ప్రాజెక్ట్‌లను అంగీకరించాను. వాటి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తానని అలియా స్పష్టం చేశారు. భర్త రణ్‌బీర్ కపూర్‌తో కలిసి నటిస్తున్న 'లవ్ & వార్' చిత్రీకరణలో రాహాను చూసుకోవడం సవాలుగా మారిన అనుభవాలను కూడా ఆమె షేర్ చేశారు. ''మేము ఎక్కువగా రాత్రివేళల్లో షూటింగ్ చేసాము. పగలు రాహాతో గడిపాము.రాత్రి సెట్‌కు వెళ్ళేవాళ్లం. రాహా సెట్‌కి వచ్చినప్పుడు మాతో కలిసి గేమ్స్ ఆడేది, సరదాగా ఉండేదని చెప్పారు. అంటే అలియా తీసుకున్న తాజా నిర్ణయం ప్రకారం, ఆమె తదుపరి సినిమాలు రాహా కోసం కూడా నవ్వుతూ చూడదగినవి, కామెడీ జానర్‌ ప్రధానంగా ఉండనున్నాయి. తన చిన్నారి కోసం చేసిన ఈ ప్రత్యేక మార్పు, అలియా అభిమానులను కూడా సంతోషపరచడం ఖాయం.