Alia Bhatt :79వ బాఫ్టా వేదికపై ఆలియా భట్… మూడవ భారతీయ నటిగా చరిత్ర
ఈ వార్తాకథనం ఏంటి
భారతీయ సినిమా రంగానికి గర్వకారణమైన నటీమణుల్లో ఒకరైన ఆలియా భట్ అంతర్జాతీయ స్థాయిలో మరో విశేష గుర్తింపు సాధించారు. 2026లో జరగనున్న 79వ బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అవార్డ్స్ (బాఫ్టా) వేడుకలో అవార్డులను అందజేసే ప్రెజెంటర్ల జాబితాలో ఆమెకు చోటు దక్కింది. ఈ ప్రతిష్టాత్మక వేదికపై అవార్డును ప్రెజెంట్ చేసే మూడవ భారతీయ నటిగా ఆలియా చరిత్ర సృష్టించనున్నారు. లండన్‌లోని ప్రముఖ రాయల్ ఫెస్టివల్ హాల్‌లో ఫిబ్రవరి 22న ఈ వేడుక ఘనంగా నిర్వహించనున్నారు.
వివరాలు
నన్ను గుర్తిస్తే 100 మార్కులు
ఈ కార్యక్రమంలో ఆలియా భట్‌తో పాటు ఆస్కార్ విజేత సిలియన్ మర్ఫీ, కేట్ హడ్సన్, బ్రయాన్ క్రాన్స్టన్, ఎథాన్ హాక్, గ్లెన్ క్లోజ్ వంటి హాలీవుడ్ ప్రముఖులు కూడా ప్రెజెంటర్లుగా పాల్గొననున్నారు. ఈ విషయాన్ని బాఫ్టా సంస్థ అధికారికంగా ప్రకటించగా, ఆ ప్రకటనను ఆలియా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ "నన్ను గుర్తిస్తే 100 మార్కులు" అంటూ సరదాగా స్పందించారు. గతంలో 2021లో ప్రియాంక చోప్రా, 2024లో దీపికా పదుకొణె ఈ గౌరవాన్ని అందుకోగా, ఇప్పుడు ఆలియా కూడా ఆ ఘనత సాధించిన జాబితాలో చేరారు. మరోవైపు ఈ ఏడాది బాఫ్టా నామినేషన్లలో మణిపురి చిత్రం 'బూంగ్' చోటు దక్కడం కూడా ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ విషయం.