LOADING...
Alka Yagnik: సంగీత ప్రపంచానికి అమూల్యమైన ఆభరణం అల్కాయాగ్నిక్
సంగీత ప్రపంచానికి అమూల్యమైన ఆభరణం అల్కాయాగ్నిక్

Alka Yagnik: సంగీత ప్రపంచానికి అమూల్యమైన ఆభరణం అల్కాయాగ్నిక్

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 27, 2026
05:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

పద్నాలుగేళ్ల వయసులో పాట పాడటం మొదలుపెట్టిన అల్కాయాగ్నిక్‌... తన సుమధుర గాత్రంతో నాలుగు దశాబ్దాలకుపైగా ప్రేక్షకుల్ని ఓలలాడించారు. అల్కాయాగ్నిక్‌ బాలీవుడ్‌ ప్రముఖ గాయనిగా అందరికీ సుపరిచితమే. "ఏక్‌దోతీన్‌" (తేజాబ్), "చమ్మా చమ్మా" (చైనా గేట్) వంటి పాటలు ఇప్పటికి సంగీత ప్రియులను అలరిస్తాయి. ఇప్పటివరకూ సినిమాలు, ఆల్బమ్స్‌తో కలిపి ఇరవై వేలకు పైగా పాటలు పాడారు. బాలీవుడ్‌లో ఎక్కువ సోలో పాటలు పాడిన గాయనిగా రికార్డునూ అల్కా సొంతం చేసుకున్నారు. 2022లో యూట్యూబ్‌లో అత్యధిక స్ట్రీమింగ్ గాయనిగా అరుదైన గుర్తింపు పొందారు. సంగీత రంగంలో చేసిన విశేష కృషికి గాను 2026 సంవత్సరానికి గాను భారత ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటైన పద్మ భూషణ్ తో సత్కరించింది

వివరాలు 

అల్కా కుటుంబం..

అల్కా కోల్‌కతా లోని గుజరాతీ కుటుంబానికి చెందిన ధర్మేంద్ర శంకర్‌, శుభ దంపతుల కుమార్తె. తల్లి శుభ, శాస్త్రీయ సంగీత కళాకారిణి కాబట్టి, చిన్నతనం నుంచి సంగీతంలో శిక్షణ పొందారు. ఆమెకు ఆరు సంవత్సరాలు ఉన్నప్పుడు ఆల్‌ ఇండియా రేడియోలో పాటలు పాడారు. ఆ తరువాత, ఆమె గొంతులోని శ్రావ్యతను గుర్తించిన రాజ్‌కపూర్‌ సంగీత దర్శకుడు లక్ష్మీకాంత్‌కు సిఫార్సు చేశారు. రికార్డు: 2021లో 17 బిలియన్ల స్ట్రీమ్స్‌తో, యూట్యూబ్‌లో ప్రపంచంలో అత్యధికంగా వినిపించిన గాయనిగా అల్కా యాగ్నిక్ గిన్నిస్ రికార్డుల్లో చోటు సంపాదించారు.

Advertisement