Allari Naresh: అల్లరి నరేష్ కొత్త సినిమా టైటిల్ 'బచ్చలమల్లి'.. మరో ప్రయోగాత్మక చిత్రానికి సిద్ధం!
హీరో అల్లరి నరేష్(Allari Naresh) తన మొదటి ఇన్నింగ్స్‌లో కామెడీ చిత్రాలతో మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. ఇక సెకండ్ ఇన్నింగ్స్ వరుస ప్రయోగాత్మక చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. గతంలో లాగా రోటిన్ కథలు కాకుండా విభిన్న తరహా కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. కామెడీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న అల్లరి నరేష్ ఇప్పుడు మాత్రం సీరియస్ సబ్జెక్ట్స్ తో మెప్పిస్తున్నాడు. ఇప్పటికే తాను నటించిన నాంది, ఇట్లు మారేడుమిల్ల ప్రజానీకం, ఉగ్రం వంటి సినిమాలు ఆడియన్స్ ని ఆకట్టుకున్నారు. తాజాగా అల్లరి నరేష్ కెరీర్‌లో 62వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'బచ్చలమల్లి' టైటిల్‌ను ఖరారు చేశాడు.
గజదొంగ పాత్రలో అల్లరి నరేష్
1990లో ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలోని తునిలో గజదొంగగా పేరుగాంచిన బచ్చలపల్లి జీవితన కథనే సినిమాగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో బచ్చలపల్లి పాత్రలో అల్లరి నరేష్ కనిపించనున్నట్లు తెలుస్తోంది. సో బ్రతుకే సో బెటర్ మూవీని తెరకెక్కించిన యంగ్ డైరక్టర్ సుబ్బు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సంగీత దర్శకులుగా విశాల్ చంద్రశేఖర్ పనిచేస్తున్నారు. హాస్య మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమా పూజా కార్యక్రమాలకు డైరెక్టర్ మారుతి, అనిల్ రావిపూడి ముఖ్య అతిథులుగా వచ్చారు