LOADING...
Dhanush: షూటింగ్‌కు హాజరు కాలేదన్న ఆరోపణలు.. ధనుష్‌కు లీగల్ నోటీసులు
షూటింగ్‌కు హాజరు కాలేదన్న ఆరోపణలు.. ధనుష్‌కు లీగల్ నోటీసులు

Dhanush: షూటింగ్‌కు హాజరు కాలేదన్న ఆరోపణలు.. ధనుష్‌కు లీగల్ నోటీసులు

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 14, 2026
10:09 am

ఈ వార్తాకథనం ఏంటి

కోలీవుడ్ నటుడు ధనుష్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. తమిళ నిర్మాణ సంస్థ తేనాండాళ్ ఫిల్మ్స్తో ఆయన మధ్య ఉన్న వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఒప్పందం ప్రకారం కమిట్‌మెంట్‌ను పూర్తి చేయకపోవడం వల్ల సినిమా ఆలస్యమైందని ఆరోపిస్తూ, రూ.20 కోట్లు నష్టపరిహారం చెల్లించాలని సంస్థ లీగల్ నోటీసులు పంపింది. ఈ వ్యవహారం ప్రస్తుతం కోలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 2016లో తేనాండాళ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై 'నాన్ రుద్రన్' అనే చిత్రాన్ని చేయడానికి ధనుష్ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ చిత్రాన్ని తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించాలని ఆయన భావించినట్లు తెలుస్తోంది.

Details

సంస్థకు రూ.20 కోట్లు నష్టం

అయితే తర్వాత దర్శకుడు మారిన నేపథ్యంలో ధనుష్ పూర్తిస్థాయి స్క్రిప్ట్‌ను అందించలేదని నిర్మాణ సంస్థ ఆరోపిస్తోంది. స్క్రిప్ట్ ఆలస్యం కావడం వల్ల షూటింగ్ ప్రారంభం కాలేకపోయిందని, దాంతో సంస్థకు సుమారు రూ.20 కోట్లు నష్టం వాటిల్లిందని పేర్కొంది. ఇప్పటివరకు ధనుష్ షూటింగ్‌కు హాజరు కాలేదని, అదే సమయంలో ఇతర చిత్రాలకు అంగీకరిస్తున్నారని ఆరోపిస్తూ సంస్థ లీగల్ నోటీసులు జారీ చేసింది. అయితే ఈ అంశంపై ధనుష్ తరఫున ఇంకా అధికారిక స్పందన రాలేదు. ప్రస్తుతం ధనుష్ తన 55వ చిత్రంలో నటిస్తున్నారు. 'D55' అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శ్రీలీల, సాయి పల్లవి కథానాయికలుగా కనిపించనున్నారు.

Advertisement