తదుపరి వార్తా కథనం
Allu Arjun: నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్.. బెయిల్ పత్రాలు సమర్పించిన బన్ని
వ్రాసిన వారు
Jayachandra Akuri
Jan 04, 2025
04:05 pm
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ నటుడు అల్లు అర్జున్ శనివారం మధ్యాహ్నం నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు.
ఆయన మామ చంద్రశేఖర్‌రెడ్డితో కలిసి కోర్టుకు వచ్చి, బెయిల్ పూచీకత్తు పత్రాలను న్యాయమూర్తికి అందజేశారు. అనంతరం కోర్టు నుంచి నేరుగా తన నివాసానికి వెళ్లిపోయారు.
సంధ్యా థియేటర్ వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు శుక్రవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
Details
ప్రతి ఆదివారం హాజరు కావాలి
కోర్టు రూ.50 వేలు చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. సాక్షులను ప్రభావితం చేయకుండా ఉండాలని, కేసును ప్రభావితం చేసేలా వ్యాఖ్యలు చేయకూడదని స్పష్టం చేసింది.
అలాగే ప్రతి ఆదివారం (రెండు నెలల పాటు) చిక్కడపల్లి పోలీసుల ముందు వ్యక్తిగతంగా హాజరు కావాలని కోర్టు షరతు విధించింది.
ఈ షరతు ప్రకారం, అల్లు అర్జున్ నేరుగా కోర్టుకు వచ్చి పూచీకత్తు పత్రాలు సమర్పించారు.