NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / పారితోషికంలో ప్రభాస్ ని మించిపోయిన అల్లు అర్జున్, ఏకంగా వంద కోట్లకు పైనే
    తదుపరి వార్తా కథనం
    పారితోషికంలో ప్రభాస్ ని మించిపోయిన అల్లు అర్జున్, ఏకంగా వంద కోట్లకు పైనే
    వందకోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలు

    పారితోషికంలో ప్రభాస్ ని మించిపోయిన అల్లు అర్జున్, ఏకంగా వంద కోట్లకు పైనే

    వ్రాసిన వారు Sriram Pranateja
    Mar 10, 2023
    02:54 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన అల్లు అర్జున్, తన రెమ్యునరేషన్ ని అమాంతం పెంచేసినట్లు వార్తలు వస్తున్నాయి. తన తర్వాతి చిత్రానికి 120కోట్లు అల్లు అర్జున్ డిమాండ్ చేసినట్లు చెప్పుకుంటున్నారు.

    ఇటీవల సందీప్ వంగా దర్శకత్వంలో అల్లు అర్జున్ సినిమా ఉంటుందని అధికారికంగా ప్రకటన వచ్చింది. టీ సిరీస్ భూషణ్ కుమార్, భద్రకాళి పిక్చర్స్ ప్రణయ్ రెడ్డి వంగా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

    ఈ సినిమా కోసం అల్లు అర్జున్ 150కోట్లు డిమాండ్ చేసాడట. కానీ మేకర్స్, 120కోట్లకు అల్లు అర్జున్ ని ఒప్పించారని వినిపిస్తోంది. ఈ లెక్కన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కంటే ఎక్కువ రెమ్యునరేషన్, అల్లు అర్జున్ కే వస్తున్నట్లు చెప్పుకోవచ్చని అంటున్నారు.

    అల్లు అర్జున్

    పుష్ప 2 మూవీతో బాహుబలి, కేజీఎఫ్ రికార్డులు బద్దలు

    అల్లు అర్జున్ తన రెమ్యునరేషన్ ని అంతలా పెంచడం వెనుక పుష్ప సినిమానే కారణమనీ, ఇప్పుడు వచ్చే పుష్ప 2 ద్వారా అల్లు అర్జున్ క్రేజ్ మరింత పెరిగే అవకాశం ఉందనీ, బాహుబలి, కేజీఎఫ్ 2 సినిమాల రికార్డులు పుష్ప 2తో బద్దలవడం ఖాయమని నెటిజన్లు అంటున్నారు.

    అదే నిజమై, పుష్ప 2 సినిమా బ్లాక్ బస్టర్ అయితే అల్లు అర్జున్ కు 120కోట్లు పారితోషికం ఇవ్వడం సబబేనని చెబుతున్నారు.

    పుష్ప 2 మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతున్నప్పటికీ ఈ సంవత్సరంలో విడుదలయ్యే అవకాశాలు కనిపించట్లేదు. వచ్చే సంవత్సరం వేసవిలో ప్రేక్షకుల ముందుకు పుష్ప 2ని తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అల్లు అర్జున్
    తెలుగు సినిమా

    తాజా

    Gold Rate: తెలుగు రాష్ట్రాల్లో పసిడి పరుగులు.. రూ. 99 వేలకి చేరువ! బంగారం
    Pakistan: భారత కార్యక్రమాలకు పాకిస్థాన్ అభ్యంతరం.. సున్నితంగా తిరస్కరించిన మలేషియా మలేషియా
    Ukraine-Russia: ఏప్రిల్ 2026 నాటికి ఉక్రెయిన్‌కు 100,000 డ్రోన్‌లు: బ్రిటన్  బ్రిటన్
    Kannappa : భీమవరంలో కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్‌.. జూన్ 22న గ్రాండ్‌గా! మంచు విష్ణు

    అల్లు అర్జున్

    అల్లు అర్జున్ బాలీవుడ్ ఎంట్రీ: షారుక్ ఖాన్ తో మల్టీస్టారర్ ? సినిమా
    అల్లు అర్జున్ సూపర్ హిట్ సినిమా దేశముదురు మళ్లీ విడుదల సినిమా రిలీజ్
    అల్లు అర్జున్, సందీప్ వంగా కాంబో: అప్పుడు మిస్సయ్యింది, ఇప్పుడు సెట్టయ్యింది తెలుగు సినిమా
    అల్లు అర్జున్ ఏషియన్ సినిమాస్ థియేటర్ లో ఎల్ ఈ డీ స్క్రీన్ తెలుగు సినిమా

    తెలుగు సినిమా

    దసరా ప్రమోషన్లు: చరిత్రలో మొదటిసారిగా 39సెంటర్లలో కౌండ్ డౌన్ బోర్డ్స్ సినిమా
    రామ్ చరణ్ పుట్టినరోజు కానుక: మగధీర మళ్లీ విడుదల రామ్ చరణ్
    గ్యాంగ్ లీడర్ రీ రిలీజ్: ఈసారి కొత్త డేట్ తో వచ్చారు సినిమా
    నాని బర్త్ డే: కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన సినిమాలు సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025