అల్లు అర్జున్ ఏషియన్ సినిమాస్ థియేటర్ లో ఎల్ ఈ డీ స్క్రీన్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ఏషియస్ సినిమాస్ థియేటర్ తో భాగస్వామ్యం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో ఏఏఏ పేరుతో అల్లు అర్జున్ ఏషియన్ సినిమాస్ థియేటర్ ను ప్రారంభించనున్నారు. మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న ఈ థియేటర్ కి సరికొత్త హంగులు రాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ థియేటర్ స్క్రీన్ ఎల్ ఈ డీ గా ఉండనుందని, దీనివల్ల కలర్స్ మరింత కాంతివంతంగా, పిక్చర్ క్వాలిటీ మరింత ఆకర్షణీయంగా ఉండనున్నాయని సమాచారం. దక్షిణ భారతదేశంలో ఇలా ఎల్ ఈ డీ స్క్రీన్ ఉన్న థియేటర్ గా అల్లు అర్జున్ ఏషియన్ సినిమాస్ కు రెండవ స్థానం దక్కనుంది. మొత్తానికి హైదరాబాద్ వాసులకు మంచి ఎక్స్ పీరియన్స్ దొరకనుంది.
ఏప్రిల్ నెలలో అల్లు అర్జున్ అభిమానులకు సర్ప్రైజ్
ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప పనులో బిజీగా ఉన్నారు. హైదరాబాద్ లో పుష్ప షూటింగ్ జరుగుతోంది. చిత్రీకరణ చాలా వేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఐతే ఈ సినిమా నుండి అప్డేట్ కావాలని జనాలు కోరుకుంటున్నారు. వారందరి కోరిక ఏప్రిల్ 8వ తేదీన తీరేలా ఉంది. ఆరోజు అల్లు అర్జున్ పుట్టినరోజు. ఈ సందర్భంగా పుష్ప 2 నుండి చిన్నపాటి గ్లింప్స్ వీడియో రానుందని వినబడుతోంది. వచ్చే సంవత్సరం వేసవిలో పుష్ప 2 మూవీణి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అదలా ఉంచితే, మొన్నటి మొన్న అల్లు అర్జున్ తన మరో ప్రాజెక్టును అనౌన్స్ చేసాడు. అర్జున్ రెడ్డి చిత్ర దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో సినిమా చేస్తున్నాడు.