LOADING...
AA23: షూటింగ్ మొదలుకాకముందే రికార్డు.. #AA23 థీమ్ సాంగ్‌తో సోషల్ మీడియా సెన్సేషన్

AA23: షూటింగ్ మొదలుకాకముందే రికార్డు.. #AA23 థీమ్ సాంగ్‌తో సోషల్ మీడియా సెన్సేషన్

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 28, 2026
03:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

అల్లు అర్జున్ కథానాయకుడిగా ప్రముఖ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందనున్న సినిమా గురించి ఇప్పటికే మంచి హైప్ నెలకొంది. AA23గా ప్రచారంలో ఉన్న ఈ సినిమా ఇంకా సెట్స్‌పైకి కూడా వెళ్లకముందే సోషల్ మీడియాలో సరికొత్త రికార్డును సొంతం చేసుకోవడం విశేషం. ఇటీవల ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటిస్తూ విడుదల చేసిన థీమ్ సాంగ్ సోషల్ మీడియాలో భారీగా ట్రెండ్ అవుతోంది. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ పాటతో ఇప్పటివరకు దాదాపు 3 లక్షల 55 వేల రీల్స్ రూపొందినట్లు సమాచారం. కొన్ని రోజులుగా వైరల్ అవుతున్న'Introduce Myself' వీడియోలకు ఈ థీమ్ సాంగ్‌ను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ఫలితంగా కేవలం 13 రోజుల్లోనే లక్షల సంఖ్యలో రీల్స్ ఈ పాటపై క్రియేట్ అయ్యాయి.

వివరాలు 

AA22xA6లో హీరోయిన్‌గా దీపికా పదుకొణె

అత్యధిక రీల్స్ సాధించిన థీమ్ సాంగ్‌గా ఇది రికార్డు స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం కూడా ట్రెండింగ్‌లో టాప్‌లో కొనసాగుతోంది. ఈ ఏడాదిలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. మరోవైపు అల్లు అర్జున్ ప్రస్తుతం దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న భారీ ప్రాజెక్ట్‌లో నటిస్తున్నారు. AA22xA6గా గుర్తింపు పొందిన ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది.ఇందులో దీపికా పదుకొణె హీరోయిన్‌గా కనిపించనున్నారు. సైన్స్ ఫిక్షన్ జానర్‌లో రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం వేగంగా సాగుతోంది. తాజాగా ఈ సినిమా గురించి మాట్లాడిన అట్లీ.. అద్భుతమైన అవుట్‌పుట్ కోసం నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని చెప్పారు. అల్లు అర్జున్ అభిమానులకు అదిరిపోయే సర్‌ప్రైజ్‌ను సిద్ధం చేస్తున్నామని ఆయన వెల్లడించారు.

Advertisement