Allu Arjun: శ్రీతేజ్‌కు అల్లు అర్జున్ పరామర్శ.. ధైర్యం చెప్పిన ఐకాన్ స్టార్
ఈ వార్తాకథనం ఏంటి
సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎట్టకేలకు పరామర్శించారు.
ఈ రోజు బేగంపేట్‌లోని కిమ్స్ ఆసుపత్రికి చేరుకున్న ఆయన, శ్రీతేజ్ చికిత్స పొందుతున్న ఐసీయూ వార్డులోకి వెళ్లి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
అల్లు అర్జున్ శ్రీతేజ్ తండ్రిని కూడా కలుసుకుని, చికిత్స గురించి అడిగి తెలుసుకున్నారు.
Details
బాధిత కుటుంబానికి అండగా ఉంటా
అక్కడ ఉన్న డాక్టర్లతో మాట్లాడిన అల్లు అర్జున్, శ్రీతేజ్ ఆరోగ్యం కొంత మెరుగుపడిందని, కానీ కోలుకోవడానికి మరికొంత సమయం అవసరమని తెలుసుకున్నారు.
అల్లు అర్జున్ రేవతి కుటుంబానికి అండగా ఉంటానని వారికి భరోసా ఇచ్చారు. అల్లు అర్జున్ వెంట తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు కూడా ఆసుపత్రికి వచ్చారు.
అల్లు అర్జున్ ఆసుపత్రికి రావడంతో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసుల్ని భారీగా మోహరించారు.