Pushpa 2 : పుష్ప 2 రిలీజ్ డేట్ మారిందా..?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో ఘన విజయం సాధించిన పుష్పకు కొనసాగింపుగా రాబోయే పుష్ప 2 పై భారీ అంచనాలు ఉన్నాయి. బన్నీ అభిమానులు, సినీ ప్రియులు ఈ సినిమా కోసం ఎంతో నిరీక్షిస్తున్నారు. దాదాపు మూడేళ్లుగా దర్శకుడు సుకుమార్ ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ ఏడాది ఆగస్టులో విడుదల కావాల్సిన ఈ చిత్రం, షూటింగ్ ఆలస్యమైన కారణంగా డిసెంబర్ విడుదలకు సిద్ధమవుతోంది. ఇదిలా ఉండగా, పుష్ప -2 విడుదలపై టాలీవుడ్ లో ప్రస్తుతం రెండు డేట్లు వినిపిస్తున్నాయి. వాస్తవానికి, డిసెంబర్ 6 న విడుదలఅవుతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే, ఒక రోజు ముందుగా డిసెంబర్ 5 న వస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో ఉన్నారు మేకర్స్.
ఓవర్సీస్‌లో భారీ బడ్జెట్ సినిమాలు విడుదల
ఇందుకు కారణం, ఓవర్సీస్‌లో భారీ బడ్జెట్ సినిమాలు విడుదల కావడం. డిసెంబర్ 5 న పుష్ప విడుదలైతే ఫస్ట్ వీక్‌లో ప్రధాన థియేటర్లలో స్క్రీన్ అందుబాటులో ఉండకపోవచ్చు. అలాగే, ఓవర్సీస్ ప్రీమియర్స్ డిసెంబర్ 4 న ఉంటే, వారం పాటు PLF ప్రదర్శనలను కచ్చితంగా ప్లాన్ చేయవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ చిత్రం లాంగ్ రన్ దొరకడం ఖాయం. ఈ రెండు అంశాల కాకుండా,డిసెంబర్ 20 న వస్తే తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఓపెనింగ్ వస్తుందని అంచనా వేస్తున్నారు మేకర్స్. క్రిస్టమస్ సమయంలో బాలీవుడ్‌లో కూడా స్టార్ హీరో సినిమాలు ఉంటాయి.మరి ఫైనల్ గా ఈ డేట్ కు వస్తుందో రాదో తెలియాలంటే మరి కొద్దీ రోజులు ఆగితే గానితెలియదు.