LOADING...
Pushpa 2 The Rule: అదిరిపోయిన అల్లు అర్జున్‌ పుష్ప 2 ది రూల్‌ టీం ప్రమోషనల్ ప్లాన్ ..!
అదిరిపోయిన అల్లు అర్జున్‌ పుష్ప 2 ది రూల్‌ టీం ప్రమోషనల్ ప్లాన్ ..!

Pushpa 2 The Rule: అదిరిపోయిన అల్లు అర్జున్‌ పుష్ప 2 ది రూల్‌ టీం ప్రమోషనల్ ప్లాన్ ..!

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 04, 2024
03:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్‌ స్టార్ యాక్టర్ అల్లు అర్జున్‌ (Allu Arjun) ప్రధాన పాత్రలో నటించిన 'పుష్ప 2: ది రూల్‌' (Pushpa 2: The Rule) ప్రాజెక్ట్‌ వేగంగా ముందుకు సాగుతోంది. ఈ సినిమా ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ రూపొందిస్తుండగా, కన్నడ నటి రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్‌లో కనిపించనున్నారు. మలయాళ నటుడు ఫహద్‌ ఫాసిల్‌ కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 2024 డిసెంబర్ 5న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో,మరో స్థాయికి తీసుకెళ్లేలా ప్రమోషనల్‌ ప్లాన్‌ గట్టిగానే చేశారన్న వార్త అభిమానుల్లో జోష్‌ నింపుతోంది.

వివరాలు 

ముంబైలో ట్రైలర్‌ లాంఛ్ ఈవెంట్‌

తాజా సమాచారం ప్రకారం, మొదటి ఈవెంట్‌ను బీహార్‌లోని పాట్నాలో నవంబర్ చివరలో నిర్వహించాలనే ప్లాన్‌ చేశారని చెబుతున్నారు. ఆ తరువాత, హుబ్లీ, కోచి, చెన్నై వంటి నగరాల్లో మరికొన్ని ప్రధాన ఈవెంట్స్‌ జరగనున్నాయి. అంతేకాదు, ముంబైలో ట్రైలర్‌ లాంఛ్ ఈవెంట్‌ను భారీ జనసమూహం మధ్య నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని ఫిలిం నగర్ సర్కిల్ నివేదికలు చెబుతున్నాయి. ఈ ప్రమోషన్ల చివరి దశలో తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాల్లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్లతో పాటు ఇతర ప్రమోషనల్‌ కార్యక్రమాలు కూడా జరుగుతాయని సమాచారం.

వివరాలు 

దేవీ శ్రీ ప్రసాద్‌ మ్యూజిక్ పై భారీగా అంచనాలు 

మొదటి భాగానికి అందించిన అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌, ఆల్బమ్ అందించిన రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్‌ సీక్వెల్‌కి కూడా పనిచేస్తుండటం వలన అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సీక్వెల్‌లో ఫహద్‌ ఫాసిల్, జగదీష్‌ ప్రతాప్ బండారి, జగపతిబాబు, ప్రకాశ్‌ రాజ్‌, సునీల్‌, అనసూయ భరద్వాజ్‌, రావు రమేశ్‌, ధనంజయ, షణ్ముఖ్‌, అజయ్‌, శ్రీతేజ్‌ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.